"వార్ 2" కోసం ఎన్టీఆర్... హృతిక్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Pulgam Srinivas
కొన్ని సంవత్సరాల క్రితం హృతిక్ రోషన్ హీరోగా టైగర్ ష్రాఫ్ విలన్ గా "వార్" అనే బాలీవుడ్ సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇక పోతే కొంత కాలం క్రితం "వార్" మూవీ కి కొనసాగింపుగా "వార్ 2" అనే మూవీ రాబోతుంది అని అందులో హృతిక్ రోషన్ మరియు ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటించబోతున్నట్లు అధికారిక ప్రకటన వెలువడిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇలా "వార్ 2" మూవీ లో హృతిక్ రోషన్ తో పాటు ఎన్టీఆర్ కూడా నటించనున్నట్లు అధికారిక ప్రకటన రావడంతో ఒక్క సారిగా ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల ఫోకస్ పడింది. దానితో ఎన్టీఆర్ ఈ సినిమాలో హీరో పాత్రల నటిస్తాడా ..? విలన్ పాత్రలో నటిస్తాడా ..? అని అనేక సందేహాలు ఎన్టీఆర్ అభిమానుల్లో అలాగే మామూలు తెలుగు ప్రేక్షకుల్లో వెలుపడ్డాయి.

ఇప్పటి వరకు ఈ వార్తలకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడ లేదు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... "వార్ 2" మూవీ పై ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఈ సినిమాను దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో నిర్మించాలని నిర్మాతలు ఇప్పటికే డిసైడ్ అయినట్లు అందులో భాగంగా ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించబోతున్న ఎన్టీఆర్ , హృతిక్ రోషన్ లకి దాదాపుగా 100 కోట్ల రెమ్యూనరేషన్ ను ఇవ్వబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: