"బీమా" కి 5 రోజుల్లో వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!

Pulgam Srinivas
మ్యచో స్టార్ గోపీచంద్ తాజాగా కన్నడ దర్శకుడు హర్ష దర్శకత్వంలో రూపొందిన భీమా అనే యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలో హీరో గా నటించాడు. మాళవికా శర్మ , ప్రియ భవాని శంకర్ లు ఈ మూవీ లో హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీ మార్చి 8 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 5 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ఇప్పటి వరకు కంప్లీట్ చేసుకుంది. ఈ 5 రోజుల్లో ఈ మూవీ కి వరల్డ్ వైడ్ గా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లు దక్కాయి అనే వివరాలను తెలుసు కుందాం.
ఈ మూవీ కి 5 రోజుల్లో నైజాం ఏరియాలో 2.08 కోట్ల కలెక్షన్ లు దక్కగా ... సీడెడ్ ఏరియాలో 87 లక్షలు ... ఏపీ లో 2.26 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 5 రోజుల్లో 5.51 కోట్ల షేర్ ... 8.95 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్ సీస్ లలో కలుపుకొని 54 లక్షల కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి 5 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 5.75 కోట్ల షేర్ ... 10.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

ఇకపోతే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 11.30 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఇకపోతే ఈ మూవీ మరో 6.25 కోట్ల షేర్ కలక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హీట్ గా నిలుస్తుంది. ఇది ఇలా ఉంటే వరుసగా పక్కా కమర్షియల్ రామబాణం సినిమాలతో , అపజాయలను ఎదుర్కొన్న గోపీచంద్ ఈ సినిమాతో కూడా విజయాన్ని అందుకోవడం కష్టంగానే కనబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

gc

సంబంధిత వార్తలు: