ఆ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించిన మహేష్..!

Pulgam Srinivas
సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మహేష్ సినిమాల్లో జనాలకు ఏ విధంగా సహాయం చేస్తూ ఉంటాడో బయట జీవితంలో కూడా జనాలకు అదే విధంగా సహాయం చేస్తూ ఎంతో మంది వ్యక్తులకు ఆదర్శంగా నిలుస్తూ తన జీవితాన్ని ముందుకు సాగిస్తున్నాడు. ఇకపోతే మహేష్ ఏదైనా సినిమా బాగుంది అంటే దానిని చూసి ఒక వేళ ఆ సినిమా మహేష్ కు కూడా నచ్చినట్టు అయితే ఆ సినిమా గురించి ప్రేక్షకులకు తెలిసే విధంగా తనకు ఆ సినిమాను చూసినప్పుడు కలిగిన అనుభవాలని నేరుగా గాని ... సోషల్ మీడియా వేదికగా కానీ తెలియ జేస్తూ ఉండే అలవాటు మహేష్ కు చాలా రోజులుగా ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఇకపోతే కొన్ని రోజుల క్రితమే మలయాళ ఇండస్ట్రీ నుండి ప్రేమలు అనే సినిమా వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా మలయాళ ఇండస్ట్రీ లో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. దానితో ఈ సినిమాని ఎస్ ఎస్ కార్తికేయ తెలుగు లో విడుదల చేశాడు. ఈ మూవీ ప్రస్తుతం తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి కలెక్షన్ లను రాబడుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాను చూసిన మహేష్ ఈ మూవీ పై ప్రశంసల వర్షం కురిపించాడు. తాజాగా ప్రేమలు సినిమా చూశాను. సినిమా చూస్తున్నంత సేపు నవ్వుతూనే ఉన్నాను.

ఇలా ఇంతకు ముందు ఎప్పుడు నవ్వేనో కూడా గుర్తులేదు. మా కుటుంబం అంతా ఈ సినిమా చూసి చాలా బాగా ఎంజాయ్ చేసింది. యంగ్ స్టార్స్ నటన అద్భుతం. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన కార్తికేయకు థాంక్స్ అని మహేష్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు. ఇక మహేష్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: