"సందీప్ కిషన్ 30" మూవీకి సంబంధించిన క్రేజీ వివరాలు ఇవే..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ నటుడు సందీప్ కిషన్ తాజాగా ఊరు పేరు భైరవ కోన అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటి మనులలో ఒకరు అయినటువంటి వర్షా బొల్లమ్మ , కావ్య దాపర్ హీరోయిన్ లుగా నటించగా ... వి ఐ ఆనంద్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. ఇకపోతే తాజాగా సందీప్ కిషన్ కెరియర్ లో 30 వ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది.

ఈ మూవీ కి సంబంధించిన కొన్ని క్రేజీ వివరాలను తెలుసుకుందాం. ఈ మూవీ కి సినిమా చూపిస్తా మామ , నేను లోకల్ , హలో గురు ప్రేమ కోసమే , ధమాకా వంటి సినిమాలకు దర్శకత్వం వహించి తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న త్రినాధ్ రావు  నక్కిన దర్శకత్వం వహించనుండగా ... ఏ కే ఎంటర్టైన్మెంట్స్ మరియు హాస్య మూవీస్ బ్యానర్ వారు సంయుక్తంగా ఈ మూవీ ని నిర్మించబోతున్నారు. ఈ మూవీ ని పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఇకపోతే త్రినాద్ రావు నక్కిన ఆఖరుగా ప్రసన్న కుమార్ బెజవాడ కథ మరియు డైలాగ్ లు అందించిన ధమాకా సినిమాకు దర్శకత్వం వహించాడు. రవితేజ హీరోగా శ్రీ లీల హీరోయిన్ గా రూపొందిన ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఇలా ధమాకా లాంటి మంచి కమర్షియల్ విజయం తర్వాత త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందబోయే సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొనే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

sk

సంబంధిత వార్తలు: