ఆ విషయంలో షారుక్ ను ఫాలో అవుతున్న సల్మాన్..?

Pulgam Srinivas
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఇప్పటికే ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించి ఇండియాలో మాత్రమే కాకుండా ఇతర దేశాలలో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇంతటి క్రేజ్ కలిగిన ఈ నటుడు ఈ మధ్య కాలంలో మాత్రం సరైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోలేకపోతున్నాడు. కొంత కాలం క్రితం ఈయన "టైగర్ 3" అనే సినిమాలో హీరో గా నటించాడు.

ఈ మూవీ ప్రంచేజ్ లో వచ్చిన మిగతా రెండు సినిమాలు కూడా భారీ విజాయలను సాధించడంతో ఈ మూవీ కూడా అద్భుతమైన విజయం సాధిస్తుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈ మూవీ మాత్రం బారి విజయాన్ని అందుకోలేదు. దీనితో సల్మాన్ , షారుఖ్ ఖాన్ ఫార్మలాను ఫాలో కావాలి అని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి షారుక్ ఖాన్ కొంత కాలం క్రితం కోలీవుడ్ స్టార్ దర్శకులలో ఒకరు అయినటువంటి అట్లీ దర్శకత్వంలో రూపొందిన జవాన్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకొని 1000 కోట్లకు పైగా కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది.

ఈ మూవీ తో షారుక్ క్రేజ్ కూడా పెరిగిపోయింది. ఇకపోతే సల్మాన్ ఖాన్ కూడా తమిళ సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి మురుగదాస్ తో తన తదుపరి సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ విషయాన్ని మురగదాస్ తన సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. మరి షారుక్ ఖాన్ లాగా సల్మాన్ ఖాన్ కూడా తమిళ స్టార్ డైరెక్టర్ తో సినిమా చేసి అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంటాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: