అనుపమ 2.0: లిప్ కిస్సులతో వరుస ఆఫర్లు?

Purushottham Vinay
మలయాళ బ్లాక్ బస్టర్ ప్రేమమ్‌ సినిమాతో సౌత్‌ లో మోస్ట్‌ పాపులర్ నటిగా గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్‌. ఈ హాట్ బ్యూటీ తెలుగుతో పాటు తమిళ ఇంకా మలయాళ భాషా చిత్రాల్లో కూడా వరుసగా నటిస్తోంది.ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డకు జోడీగా టిల్లు స్క్వేర్‌ (డీజే టిల్లు 2) సినిమాలో నటించింది. ఈ సినిమాలో ముద్దులతో రెచ్చిపోయింది.టిల్లు స్క్వేర్‌ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరో తెలుగు సినిమాలో కూడా అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నట్టు సమాచారం తెలుస్తుంది. ఇదే సమయంలో తమిళంలో మారి సెల్వరాజ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఒక ప్రతిష్టాత్మక సినిమాలో కూడా ఈ హాట్ బ్యూటీ హీరోయిన్‌ గా ఎంపిక అయ్యింది.తమిళ  స్టార్‌ హీరో విక్రమ్‌ వారసుడు ధృవ్‌ హీరోగా మారి సెల్వరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్‌ ఎంపిక అయ్యింది. ఈ విషయం కూడా అధికారికంగా కన్ఫర్మ్‌ అయ్యింది. తాజాగా అందుకు సంబంధించిన ఫోటోను కూడా షేర్‌ చేశారు.


 దృవ్ అనుపమ కంటే రెండేళ్లు చిన్నోడు. అతనితో రొమాన్స్ చెయ్యడానికి రెడీ అయింది అనుపమ.ఒక వైపు పెద్ద హీరోలతో నటిస్తూ మరో వైపు చిన్న హీరోలతో కూడా సినిమాలు చేస్తూ ఏడాదికి మూడు నాలుగు సినిమాలకు తక్కువ కాకుండా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అనుపమ. ఇక తాజాగా ధృవ్‌ తో నటించేందుకు ఎంపిక అయిన నేపథ్యంలో కచ్చితంగా తమిళనాట మరింత బిజీ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.నిజానికి ఒకానొక టైంలో అనుపమకి వరుస ప్లాపులు వల్ల ఆఫర్లు తగ్గిపోయాయి.దానికి కారణం ఆమె పెట్టుకున్న హద్దులే. కానీ ఎప్పుడైతే రౌడీ బాయ్స్ అనే సినిమాలో తన హద్దులు దాటి లిప్ లాక్ లకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో అప్పటినుండి అనుపమకి ఆఫర్స్ క్యూ కట్టాయి. ఇక టిల్లు స్క్వేర్ ట్రైలర్ లో ఈ హాట్ బ్యూటీ రొమాన్స్ కి కుర్ర కారు షాక్ అయిపోయింది. దాంతో మళ్ళీ మునుపటిలా అవకాశాలు పెరిగాయి. మరి చూడాలి అనుపమ మళ్ళీ తన జెండా పాతుతుందో లేదో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: