బాలీవుడ్ నీ మెయిన్ గా టార్గెట్ చేసిన "దేవర"..?

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... హిందీ సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన నటులలో ఒకరు అయినటువంటి సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో ప్రతి నాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. మొత్తం రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ మూవీ యొక్క మొదటి భాగాన్ని ఈ సంవత్సరం అక్టోబర్ 10 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు.

ఇకపోతే ఈ మూవీ బృందం వారు ఈ సినిమాను పాన్ ఇండియా మూవీ గా విడుదల చేయనున్నప్పటికీ తెలుగు తర్వాత ఈ మూవీ మేకర్స్ ఎక్కువ శాతం హిందీ మార్కెట్ ను ఫోకస్ చేసినట్లు కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈ మూవీ మేకర్స్ హిందీ సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన బ్యూటీలలో ఒకరు అయినటువంటి జాన్వీ కపూర్. ఈ సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ చేసుకున్నారు. అలాగే హిందీ సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన నటనలో ఒకరు అయినటువంటి సైఫ్ అలీ ఖాన్ ను విలన్ పాత్రలో ఎంపిక చేసుకున్నారు. ఇలా హిందీ సినీ పరిశ్రమకు చెందిన ఇద్దరు ప్రముఖ నటీ నటులు ఈ సినిమాలో ఉండడంతో ఆటోమేటిక్ గా ఈ మూవీ కి హిందీ మార్కెట్ లో మంచి క్రేజ్ ఏర్పడే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.

అదే విధంగా ఈ మధ్య కాలంలో హిందీ ప్రేక్షకులు ఎక్కువ శాతం మాస్ యాక్షన్ సినిమాలను ఇష్టపడుతూ వస్తున్నారు. అలాంటి సినిమాలకు ఆ ప్రాంతంలో కలెక్షన్ లు కూడా భారీగా వస్తున్నాయి. ఇకపోతే దేవర మూవీ కూడా పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కావడంతో ఈ సినిమాకు ఇది బాలీవుడ్ లో ఒక ప్రధాన ఆకర్షణ కూడా అయ్యే అవకాశం ఉంది. ఇలా ఈ మూవీ తెలుగు ప్రేక్షకుల తర్వాత ఎక్కువ శాతం హిందీ ప్రేక్షకులను టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: