అశ్విన్ బాబు మరో కొత్త మూవీ టైటిల్ ను రిలీజ్ చేసిన మూవీ మేకర్స్..!!!!

murali krishna
బుల్లితెర యాంకర్, దర్శకుడు ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు హీరోగా మరో కొత్త మూవీ సిద్ధమవుతోంది. సోమవారం ఈ మూవీ టైటిల్ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ మూవీకి 'శివం భజే' టైటిల్ను ఖరారు చేశారు.పోస్టర్ను చూస్తే.. ఇది కూడా ‘హను మాన్’ మూవీ జోనర్లో ఉండవచ్చని తెలుస్తోంది. ఇందులో శివుడి నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బజ్ ఖాన్ కూడా నటిస్తున్నాడు. దిగంగన సూర్యవంశీ ఈ మూవీతో హీరోయిన్గా పరిచయం కాబోతుంది.అప్సర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై మహేశ్వర రెడ్డి నిర్మిస్తున్నారు. వికాశ్ బదిశా సంగీతం అందిస్తున్నాడు. ‘హను మాన్’ ఫేమ్ దాశరధి శివేంద్ర ఈ మూవీకి సినిమాటోగ్రఫీ అందిస్తుండటం విశేషం. యాక్షన్, ఎమోషన్, థ్రిల్, ఎంటర్టైన్మెంట్.. ఇలా అన్నిరకాలుగా తమ మూవీ ప్రేక్షకులను అలరిస్తుందని, దర్శకుడు అప్సర్ ఇన్నేవేటివ్ స్టోరీలైన్తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారని నిర్మాత మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు. ఈ మూవీలో ఇంకా హైపర్ ఆది, సాయి ధినా తదితరులు నటిస్తున్నారు.అశ్విన్ బాబు నటించిన ‘హిడింబ’ మూవీ థియేటర్లో పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. అయితే, ఓటీటీలో మాత్రం దూసుకెళ్లింది. అశ్విన్ కూడా ఈ మూవీలో తన నటనకు మంచి మార్కులు కొట్టేశాడు. దీంతో ఫుల్టైమ్ హీరోగా సెటిల్ అయ్యే ప్రయత్నాల్లో ఉన్నాడు. కథలను జాగ్రత్తగా ఎంచుకుంటున్నాడు. ఇటీవల అశ్విన్ తన 8వ చిత్రాన్ని కూడా ప్రకటించాడు. ఆ మూవీకి ‘వచ్చినవాడు గౌతం’ అనే టైటిల్ను ఖరారు చేశారు. చేతిలో స్టెతస్కోప్తో రక్తంతో ఉన్న ఈ ఫస్ట్ లుక్ చాలా ఆసక్తికరంగా ఉంది. దీన్ని బట్టి చూస్తే ‘వచ్చినవాడు గౌతం’ చిత్రం మెడికో థ్రిల్లర్గా తెరకెక్కనుందని అర్థమవుతోంది. అంతే కాకుండా ఈ సినిమా కోసం అశ్విన్ ఫిజికల్ ట్రాన్ఫర్మేషన్కు సిద్ధమవుతున్నట్టు సమాచారం.యాంకర్ ఓంకార్ సోదరుడిగా సినిమాల్లోకి వచ్చిన అశ్విన్ బాబుకు ‘శివం భజే’ 9వ చిత్రం. ‘వచ్చినవాడు గౌతమ్’ 8వ చిత్రం. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. దీంతో ‘శివం భజే’ మూవీకి ప్రీ-ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టారు. అశ్విన్.. 2012లో ‘జీనియస్’ మూవీ ద్వారా టాలీవుడ్కు పరిచయమయ్యాడు. ఆ తర్వాత ‘జత కలిసే’, ‘రాజుగారి గది’, ‘నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్’, ‘రాజుగారి గది 2’, ‘రాజు గారి గది 3’, ‘హిడింబ’ మూవీస్తో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. మరి, ‘వచ్చినవాడు గౌతమ్’, ‘శివం భజే’ మూవీస్ అశ్విన్ బాబు కెరీర్ను ఏ విధంగా మారుస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: