నితీష్ రెడ్డి ఇన్నింగ్స్ పై.. ప్యాట్ కమిన్స్ ఏమన్నాడంటే?

praveen
ప్రస్తుతం ఐపీఎల్ పోరు ప్లే ఆఫ్ దశకు చేరుకుంది. ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగా సాగుతుంది. ప్లే ఆఫ్ లో అడుగు పెట్టడమే లక్ష్యంగా ప్రతి జట్టు కూడా విరోచితమైన పోరాటం కనబరుస్తుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రత్యర్థి జట్లు తమ ముందు భారీ టార్గెట్లో ఉంచిన ఎక్కడా తడబడకుండా ఇక అలవోకగా చేదిస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఇటీవల సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అనే విషయంపై అటు ఆయా జట్ల అభిమానులు కూడా ఒక నిర్ణయానికి రాలేకపోయారు. ఎందుకంటే మొదట సన్రైజర్స్ బ్యాటింగ్ విభాగం విఫలం కావడంతో ఆ జట్టుకు ఓటమి ఖాయం అనుకున్నారు.  కానీ ఆ తర్వాత ఆ జట్టు బ్యాట్స్మెన్లు పుంజుకుని రెండు వందల పరుగులు చేశారు. అయితే ఇక భారీ టార్గెట్ ను చేదించేందుకు బలిలోకి దిగిన రాజస్థాన్ బ్యాట్స్మెన్లు కూడా దూకుడు ప్రదర్శించారు. దీంతో అలవోకగా విజయం సాధిస్తుంది అనుకున్నప్పటికీ చివరి బంతి వరకు ఆట సాగింది. దీంతో చివరి బంతిలో ఎవరు విజయం సాధిస్తారు అనే ఉత్కంఠ నెలకొనగా.. అటు ఒక్క పరుగు తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయం సాధించింది.

అయితే ఈ మ్యాచ్ లో సన్రైజర్స్ విజయం సాధించింది అంటే అటు తెలుగోడి తెగువే కారణం అని చెప్పాలి. ఎందుకంటే కీలకమైన వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అతను అద్భుతమైన ఇన్నింగ్స్  ఆడాడు. స్లోగా సాగుతున్న ఇన్నింగ్స్ లో జోష్ నింపి దూకుడు పెంచాడు.  42 బంతుల్లోనే 78 పరుగులు చేశాడు. దీంతో అతని ఇన్నింగ్స్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు అందరు.  నితీష్ కుమార్ అద్భుతమైన ఇన్నింగ్స్ గురించి సన్రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నితీష్ అద్భుతంగా ఆడాడు. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ ఫీల్డింగ్ లో కూడా రాణించాడు. సరైన సమయంలో బ్యాట్ జులిపించాడు  అంటూ ప్రశంసలు కురిపించాడు ప్యాట్ కమిన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: