మరోసారి ఆదర్శకుడితో పని చేయనున్న నాగశౌర్య..?

Pulgam Srinivas
టాలీవుడ్ యువ నటుడు నాగ శౌర్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు . ఈయన ఇప్పటికే పలు విజయవంతమైన సినిమాలలో హీరో గా నటించి తెలుగు సినీ పరిశ్రమ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు . ఇది ఇలా ఉంటే ఆఖరుగా ఈ నటుడు పవన్ బాసం శెట్టి అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో రూపొందిన రంగబలి అనే పవర్ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు . ఈ మూవీ విడుదలకు ముందు ఈ చిత్ర బృందం ప్రమోషన్ లను అద్భుతమైన రీతిలో నిర్వహించడం ... అలాగే ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు కూడా బాగుండడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

అలా మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని మాత్రమే అందుకోగలిగింది. ఇకపోతే తనకు మొట్ట మొదటి సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చిన నాగ శౌర్య కు ఎలాగైనా సరే అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందించాలి అని పవన్ గట్టిగా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

దానితో నాగ శౌర్య కోసం మరో అదిరిపోయే కథను ఈయన రెడీ చేస్తున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఇప్పటికే ఈయన కథను సిద్ధం చేయడం దానిని నాగ శౌర్య కు వినిపించడం ... ఆ కథ సూపర్ గా నచ్చడంతో ఈయన మరోసారి ఈ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అన్ని జరిగిపోయినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం వీరి కాంబో మూవీ కి సంబంధించిన అప్డేట్ మరో కొన్ని రోజుల్లో అధికారికంగా వెలువడబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ns

సంబంధిత వార్తలు: