ఏకంగా ఆ సీనియర్ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన చాందిని చౌదరి..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటి గా కెరియర్ ను కొనసాగిస్తున్న వారి లో యంగ్ బ్యూటీ చాందిని చౌదరి ఒకరు. ఈ నటి మధురం అనే వెబ్ సిరీస్ తో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది . ఆ తర్వాత ఈమెకు వరుసగా సినిమాలలో అవకాశాలు రావడం మొదలు అయ్యాయి . ఈమెకు  కెరియర్ ప్రారంభంలో నటించిన సినిమాల ద్వారా పెద్దగా గుర్తింపు దక్కలేదు. అలాంటి సమయం లోనే ఈమె సుహాస్ హీరో గా రూపొందిన కలర్ ఫోటో అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ థియేటర్ లలో కాకుండా నేరుగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ విడుదల అయింది.

ఇకపోతే "ఓ టి టి" లో విడుదల అయినప్పటికీ ఈ సినిమా ప్రేక్షకులను , విమర్శకుల ను అద్భుతమైన స్థాయిలో ఆకట్టుకుంది. అలాగే ఈ మూవీ లో ఈ బ్యూటీ తన నటన తో కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడం తో ఈ సినిమా తర్వాత నుండి ఈమెకు వరుస సినిమా అవకాశాలు దక్కుతున్నాయి . అందు లో భాగంగా తాజాగా ఈ నటి విశ్వక్ సేన్ హీరో గా రూపొందిన "గామి" అనే సినిమాలో కూడా ఓక కీలక పాత్రలో నటించింది.

ఇకపోతే ప్రస్తుతం వరుస అవకాశాల తో కెరియర్ ముందుకు సాగిస్తున్న ఈ బ్యూటీ కి నందమూరి నట సింహం బాలకృష్ణ హీరో గా బాబీ దర్శకత్వం లో రూపొందుతున్న సినిమాలో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది . ఈ బ్యూటీ ఈ సినిమాలో చాలా తక్కువ నిడివి ఉన్న పాత్రలోనే కనిపించబోతున్నట్లు తెలుస్తుంది . కాక పోతే ఈ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతున్నట్లు ... అలాగే ఈ పాత్రే కథ మొత్తాన్ని మలుపు తిప్పబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

cc

సంబంధిత వార్తలు: