ఎప్పుడు ట్రై చేయని.. కొత్త కాన్సెప్ట్ తో త్రివిక్రమ్ సినిమా.. హీరో ఎవరంటే?

praveen
మాటల మాంత్రికుడు గురూజీ దారేటు. ప్రస్తుతం గత కొంతకాలం నుంచి ఇండస్ట్రీలో ఇదే విషయంపై చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇక గురూజీ తన నెక్స్ట్ సినిమా ఎవరితో తీయబోతున్నారు అనే విషయంపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. ఈ సంక్రాంతికి సెన్సేషన్ సృష్టించాలి అని మహేష్ బాబు తో సినిమాను తీసి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు త్రివిక్రమ్. కానీ గుంటూరు కారం సినిమా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది అని చెప్పాలి. ఇక సూపర్ హిట్ అవుతుంది అనుకున్న మూవీ అంతంత మాత్రం గానే ప్రేక్షకాదరణ పొందుతుంది. దీంతో ఈ సినిమాను హిట్టు అనలేక ఫ్లాప్ అనలేక ఇక అభిమానులు సైతం కన్ఫ్యూజన్లో పడిపోయారు అని చెప్పాలి.

 ఇలా గుంటూరు కారం సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళితో సినిమాకి రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమా కోసం ప్రస్తుతం తనను తాను మార్చుకుంటున్నాడు అని చెప్పాలి. కానీ అటు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం తన నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోలు ఎవరు కూడా ఖాళీగా లేరు. వరుస ప్రాజెక్టులతో డేట్స్ ఖాళీ లేకుండానే ఉన్నారు. దీంతో ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తమిళ స్టార్ దళపతి విజయ్ తో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దానయ్య ఈ కాంబినేషన్ సెట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడట  కొన్ని రోజుల క్రితమే దానయ్య త్రివిక్రమ్, విజయ్ మధ్య మీటింగ్ ఏర్పాటు చేసినట్లు సమాచారం.

 ఇందుకు సంబంధించి కోలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇక త్రివిక్రమ్ అటు విజయ్ తో చేయబోయే సినిమాకు సంబంధించిన బ్యాక్ డ్రాప్ ని కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. కంప్లీట్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లోనే ఈ మూవీ ఉండబోతుందట. పవర్ఫుల్ పొలిటీషియన్ పాత్రలో విజయ్ కనిపించబోతున్నాడు అన్నది తెలుస్తోంది. అయితే త్రివిక్రమ్ ఎప్పుడు కూడా కంప్లీట్ పొలిటికల్ నేపథ్యమున్న సినిమా తీయలేదు. సినిమాల్లో పొలిటికల్ నేపథ్యం ఉన్నప్పటికీ అది ఒక భాగంగా మాత్రమే ఉంటుంది. అయితే ఇప్పుడు ఏకంగా విజయ్ కోసం పూర్తిగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కథను సిద్ధం చేశాడట మాటలు మాంత్రికుడు. అయితే ఇప్పటికే విజయ్ తమిళనాట పొలిటికల్ పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే. దీంతో ఇక త్రివిక్రమ్ సినిమా పై భారీ రేంజ్ లోనే అంచనాలు పెరిగిపోతున్నాయ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: