ఆ మూవీలోని సన్నివేశం కోసం చిరంజీవిని మూడు నెలలు వెయిట్ చేయించా... బాబు మోహన్..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన కమిడియన్ లలో బాబు మోహన్ ఒకరు . ఈయన కొన్ని సంవత్సరాల క్రితం వరుస సినిమా లలో నటిస్తూ ఫుల్ బిజీ కమెడియన్ లలో ఒకరిగా తెలుగు సినీ పరిశ్రమ లో కెరియర్ ను కొనసాగించాడు . ఇకపోతే అలా సినీ పరిశ్రమలో అద్భుతమైన నటుడు గా కెరియర్ ను కొనసాగిస్తున్న సమయం లోనే ఈయన రాజకీయాలపై దృష్టి పెట్టాడు . అందులో భాగంగా రాజకీయాల్లో కూడా బాబు మోహన్ అద్భుతంగా రాణించాడు.

ఇకపోతే తాజాగా బాబు మోహన్ ఆ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు . ఆ ఇంటర్వ్యూ లో భాగంగా ఈయన ముఠామేస్త్రి సినిమా సమయం లో జరిగిన ఒక సన్నివేశం గురించి తెలియ జేశారు . మెగాస్టార్ చిరంజీవి హీరో గా కొన్ని సంవత్సరాల క్రితం ముఠామేస్త్రి అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఆ సమయం లో అద్భుతమైన విజయం సాధించింది. ఇకపోతే ఈ మూవీ గురించి తాజాగా బాబు మోహన్ మాట్లాడుతూ ... ముఠామేస్త్రి సినిమాలో నాకు చిరంజీవి మధ్య కొన్ని సన్నివేశాలు ఉంటాయి.

అందులో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించిన తర్వాత ఒక సన్నివేశం పెండింగ్ లో ఉంది. ఇక ఆ సన్నివేశం తీయాలి అని చిత్ర బృందం ఎంత ప్రయత్నిస్తూ వస్తున్న నేను ఇతర సినిమాలతో ఫుల్ బిజీగా ఉండడంతో మూడు నెలల వరకు ఆ సన్నివేశం తీయడం కుదరలేదు. అలా నా కోసం చిరంజీవి మూడు నెలలు చేశాడు అని బాబు మోహన్ తాజా ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే ముఠామేస్త్రి సినిమా లోని చిరంజీవి నటనకు ఆ సమయం లో ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: