అప్పటి నుండి ఓటిటి లో "ఆపరేషన్ వాలెంటైన్"..!

Pulgam Srinivas
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజాగా ఆపరేషన్ వాలెంటైన్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో బాలీవుడ్ బ్యూటీ మనుషి చిల్లర్ హీరోయిన్ గా నటించగా ... రోహన్ శర్మ , నవదీప్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలల్ నటించారు. శక్తి ప్రతాప్ సింగ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మార్చి 1 వ తేదీన మంచి అంచనాల నడుమ తెలుగు తో పాటు హిందీ భాషలో కూడా విడుదల అయింది.

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ మొదటి రోజు మంచి కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టినప్పటికి ఆ తర్వాత మాత్రం ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తన జోరును చూపించలేకపోయింది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన బాక్స్ ఆఫీస్ రన్ కూడా ఆల్మోస్ట్ క్లోజ్ అయింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రన్ ఆల్మోస్ట్ క్లోజ్ కావడంతో ఈ సినిమా "ఓ టి టి" విడుదలకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ఈ మధ్య కాలంలో చాలా వైరల్ అవుతుంది.

ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" సంస్థ దక్కించుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఈ సినిమాను ఈ నెల 29 లోగా "ఓ టి టి" లో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ... ఒక వేళ ఈ సినిమా ఈ నెల 29 లోపు "ఓ టి టి" లోకి రానట్లు అయితే వచ్చే నెల మొదటి వారంలో కచ్చితంగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: