నా కెరియర్ ను ఆ 3 మూవీలు మలుపు తిప్పాయి... మహేష్..!

Pulgam Srinivas
సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకం గా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఇప్పటికే ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరో గా నటించిన మహేష్ ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోలలో ఒకరి గా కెరియర్ ను కొనసా గిస్తున్నాడు. ఇక పోతే తాజాగా మహేష్ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూ లో భాగంగా ఆయన కెరియర్ ను మలుపు తిప్పిన మూడు సినిమాల గురించి మహేష్ చెప్పుకొచ్చాడు . తాజా ఇంటర్వ్యూ లో భాగంగా మహేష్ మాట్లాడుతూ ... మురారి , పోకిరి , శ్రీ మంతుడు ఈ మూడు సినిమాలు నా కెరియర్ ను పూర్తిగా మలుపు తిప్పాయి. ఈ మూడు సినిమాలు నాకు ప్రేక్షకులను చాలా దగ్గర చేశాయి అని చెప్పుకొచ్చాడు. 

ఇకపోతే మహేష్ హీరో గా రూపొందున మురారి సినిమాకు కృష్ణ వంశీ దర్శకత్వం వహించగా ... పోకిరి సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. శ్రీ మంతుడు సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించాడు. ఈ మూడు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకొని భారీ కలక్షన్ లను వసూలు చేశాయి. ఇది ఇలా ఉంటే మహేష్ బాబు ఆఖరుగా గుంటూరు కారం అనే సినిమాలో హీరో గా నటించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే మహేష్ తన తదుపరి మూవీ ని గ్లోబల్ స్థాయిలో క్రేజ్ కలిగిన దర్శకుడు అయినటువంటి ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ మూవీ మరికొన్ని రోజుల్లోనే స్టార్ట్ కాబోతోంది. రాజమౌళి ... మహేష్ కాంబో లో రూపొందబోతున్న మూవీ కావడంతో ఈ మూవీ పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: