"బీమా" హిట్ అనిపించుకోవాలంటే అన్ని కోట్లు రాబట్టాల్సిందే..?

Pulgam Srinivas
మ్యాచో స్టార్ గోపీచంద్ తాజాగా బీమా అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ప్రియ భవాని శంకర్ , మాళవిక శర్మ హీరోయిన్ లుగా నటించగా ... హర్ష అనే కన్నడ దర్శకుడు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకి రవి బశ్రుర్ సంగీతం అందించాడు. ఇకపోతే ఈ మూవీ నిన్న అనగా మార్చి 8 వ తేదీన మహా శివరాత్రి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ టాక్ దక్కింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా భారీ మొత్తంలో ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ.కి వరల్డ్ వైడ్ గా ఎన్ని కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల షేర్ కలెక్షన్ లు సాధిస్తే విజయాన్ని అందుకుంటుంది అనే వివరాలను తెలుసుకుందాం.
ఈ మూవీ కి నైజాం ఏరియాలో 3.5 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగకగా , సిడెడ్ ఏరియాలో 1.5 కోట్లు , ఆంధ్ర ఏరియాలో 4.5 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తంగా ఈ సినిమాకి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో కలుపుకొని 9.50 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇకపోతే ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్ సీస్ లలో కలుపుకొని 1.8 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 11.30 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ కనుక ప్రపంచ వ్యాప్తంగా 12 కోట్ల షేర్ కలెక్షన్ పను రాబట్ట గలిగినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్మలాను కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

gc

సంబంధిత వార్తలు: