టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు గుంటూరు కారంతో రికార్డులు తిరగరాసి ప్రస్తుతం రాజమౌళి కోసం రెడీ అవుతున్నారు. ఈమధ్యనే జర్మనీ వెళ్లి ఫిట్నెస్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తున్న కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించనున్న ఈ సినిమాపై ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే భారీ హైప్ నెలకొంది.ఆర్ ఆర్ ఆర్ సక్సెస్ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న రాజమౌళి మహేష్ ప్రాజెక్ట్ పై మరింత శ్రద్ధ పెట్టారు. ఇప్పటికే స్క్రీప్ట్ వర్క్ కంప్లీట్ అవ్వగా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇక ఇందులో హాలీవుడ్ స్టార్ నటీనటులు కనిపించనున్నారని.. ఈ సంవత్సరం వేసవిలోనే ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కానుందని అంటున్నారు. కానీ ఈ విషయంపై ఇప్పటి దాకా ఎలాంటి అఫీషియల్ ప్రకటన రాలేదు. రాజమౌళి తెరకెక్కించే ఈ ప్రాజెక్టులో మహేష్ మొత్తం ఏకంగా ఎనిమిది గెటప్స్ లో కనిపించనున్నారని సమాచారం తెలుస్తుంది.
ఇంకా అలాగే ఈ సినిమా కోసం తాను ఎంతో ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యలో చెప్పుకొచ్చారు సూపర్ స్టార్ మహేష్.
అయితే ఇదిలా ఉంటే.. తాజాగా మహేష్ న్యూలుక్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. లేజర్ ఫోకస్ అంటూ ఓ కొత్త ఫోటోను తన ఇన్ స్టాలో షేర్ చేశారు మహేష్ బాబు. అందులో లైట్ బీర్డ్ అండ్ లాంగ్ హెయిర్ తో అచ్చం హాలీవుడ్ రేంజ్ హీరోగా కనిపిస్తున్నాడు మహేష్. ప్రస్తుతం ఈ ఫోటో చూసి మురిసిపోతున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్. ఎస్ఎస్ఎంబీ 29 కోసమే ఈ లుక్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రాజమౌళి తెరకెక్కించే ఈ మూవీలో మహేష్ పూర్తిగా హాలీవుడ్ హీరోలా కనిపించనున్నారని అంటున్నారు. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఈ మూవీను తీసుకువస్తున్నట్లు ఇదివరకే రాజమౌళి వెల్లడించారు.ఎస్ఎస్ఎంబీ 29 కోసం రాజమౌళి మహేష్ బాబుతో మొత్తం ఎనిమిది లుక్స్ ట్రై చేయిస్తున్నారట. ఇప్పటికే అందుకు తగిన డిజైన్స్ కూడా జరిగాయని.. అందులో మహేష్ కు ఏది సెట్ అయితే దానిని ఫైనల్ చేయనున్నట్లు సమాచారం తెలుస్తోంది. అలాగే ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యే దాకా మహేష్ తన ఫ్యాన్స్ ముందుకు రారని.. ఎలాంటి ఈవెంట్స్, ప్రమోషన్లలోనూ పాల్గొనకూడదని జక్కన్న రిక్వెస్ట్ చేశారట.