ప్రియుడితో పెళ్లికి రెడీ అయిన టాలీవుడ్ టాప్ సింగర్..!

Anilkumar
తెలుగు తమిళంలో ఎన్నో పాటలను పాడి భారీ గుర్తింపును తెచ్చుకున్న సింగర్ హారిక నారాయణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మధ్యకాలంలో వారసుడు సినిమాలోని తలపతి పాటతో మరింత గుర్తింపు తెచ్చుకుంది. విభిన్న వాయిస్లతో ఎంతోమంది మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటుంది. ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో సైతం చాలా యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా ఈ బ్యూటీకి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. టాలీవుడ్ కోలీవుడ్ అన్న తేడా లేకుండా ప్రస్తుతం వరుసగా పాటలు పాడుతూ బిజీగా ఉంది. 

ఇక అలా ఆమె పాడిన  పాటలన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి.. అయితే ఈ ప్రస్తుతం ఈ బ్యూటీ తన ప్రియుడితో ఏడడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. తాజాగా తన నిశ్చితార్థం కూడా జరిగినట్లుగా తెలుస్తోంది. కాగా ఈ విషయాన్ని హారిక స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో షేర్ చేసుకుంది. తన కాబోయే భర్తకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఇక  తెలుగు తమిళంలో ఎన్నో పాటలను పాడి భారీ గుర్తింపును తెచ్చుకున్న  హారిక కు కాబోయే భర్త పేరు పృథ్వీనాథ్ వెంపటి. వీరిద్దరు గత ఏడేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు సమాచారం. 

'ఏడేళ్ల నుంచి మనది అద్భుతమైన అనుబంధం. దీనిని అధికారికంగా మరో స్థాయికి తీసుకెళ్తున్నాం. కొత్త అనుబంధాన్ని మరింత కొత్తగా మొదలుపెడదాం' అంటూ నిశ్చితార్థం ఫోటోస్ షేర్ చేసింది తెలుగు తమిళంలో ఎన్నో పాటలను పాడి భారీ గుర్తింపును తెచ్చుకున్న  హారికా. దీంతో వీరికి సినీ ప్రముఖులు, సన్నిహేతులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వీరిద్దరి నిశ్చితార్థం కుటుంబసభ్యుల సమక్షంలో జరిగినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం. హారికా నారాయణ్.. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా రాజోలులో జన్మించింది. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తిచేసిన హారికా.. ఇప్పుడు గాయనిగా శ్రోతలను ఆకట్టుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: