తల్లి పై షాకింగ్ కామెంట్స్ చేసిన వరలక్ష్మి శరత్ కుమార్..!?

Anilkumar
స్టార్ హీరో కొడుకు కానీ కూతురు కానీ హీరో/ హీరోయిన్ అవ్వాలని రూల్ ఏమి లేదు, మనసుకి నచ్చిన పాత్రలు చేసుకోవచ్చు అనేందుకు ఉదాహరణగా నిలిచింది వరలక్ష్మి శరత్ కుమార్. ప్రముఖ తమిళ హీరో శరత్ కుమార్ కూతురిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. కెరీర్ ప్రారంభం లో ఆమె హీరోయిన్ రోల్స్ చేసింది. పలు హిట్స్ కూడా లభించాయి.కానీ మధ్యలో ఆమెకి కొన్ని డిజాస్టర్ ఫ్లాప్స్ రావడం తో వరలక్ష్మి శరత్ కుమార్ ని హీరోయిన్ గా పెట్టుకునేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపించలేదు. దీనితో ఆమె సరైన సమయం లో సరైన నిర్ణయం తీసుకుంది.

 కేవలం హీరోయిన్ రోల్స్ కి మాత్రమే పరిమితం కాకుండా, క్యారక్టర్ ఆర్టిస్టు రోల్స్ మరియు లేడీ విలన్ రోల్స్ కి షిఫ్ట్ అయ్యి సౌత్ లోనే మోస్ట్ డిమాండ్ ఉన్న లేడీ విలన్ గా మారిపోయింది వరలక్ష్మి శరత్ కుమార్.తాజాగా ఈ నటి ఓ ఇంటర్వ్యూకు హాజరై పలు ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది. శరత్‌ కుమార్ - చాయా దంపతులకు ఈ నటి జన్మించింది. తర్వాత వరలక్ష్మి తండ్రి సీనియర్ హీరోయిన్ రాధికను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తాజా ఇంటర్వ్యూలో సవతి తల్లిపై ఈ నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.  అసలు ఆమె నా తల్లి కాదు. నా ఫ్రెండ్.

సవతి తల్లి అయినప్పటికీ మేమిద్దరం చాలా క్లోజ్ గా ఉంటాం. హెల్తీగా ఉండాలంటే మంచి ఫుడ్ తీసుకోవాలని చెబుతుంది. అలాగే కెరీర్‌కు సంబంధించి ఎన్నో సూచనలు ఇస్తుంటుంది. కానీ, ఏదైనా సీక్రెట్ ఆమెకు చెబితే.. దాన్ని వెంటనే అందరికీ చెప్పేస్తుంది. అలా నన్ను చాలా సార్లు ఇబ్బంది పెట్టింది. కానీ తను కావాలని అలా చేయదు. అనుకోకుండా అలా చేప్పెస్తుందంతే. అంటూ వరలక్ష్మి శరత్ కుమార్ చెప్పుకొచ్చింది. దీంతో ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక వరలక్ష్మి శరత్ కుమార్ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల హనుమాన్ సినిమాలో హీరోకి అక్క పాత్రలో కనిపించింది ఈ ముద్దుగుమ్మ. కాగా వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: