ఆ విషయంలో మా అత్తగారే నాకు స్ఫూర్తి.. ఉపాసన..!?

Anilkumar
ఆర్‌ఆర్‌ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా గేమ్ ఛేంజర్. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది 2025లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇక మెగా పవర్ స్టార్ రాంచరణ్ భార్య ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

నాలెడ్జి సిటీలోని టి-హబ్‌లో ట్రంఫ్‌ ఆఫ్‌ టాలెంట్‌ హౌజ్‌ ఆఫ్‌ మేకప్‌ ఆధ్వర్యంలో వివిధ రంగాలలో రాణించిన మహిళలకు విమెన్‌ ఆఫ్‌ ఇంపాక్ట్‌ అవార్డుల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం రాత్రి నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 'మా అత్తమ్మ ఎంతో ప్రేమగల వ్యక్తి..ఆమే నాకు స్ఫూర్తి' అని చెప్పారు. ప్రధానంగా నేడు ధైర్యంగా, ధృఢంగా ఉండే మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపేందుకే ఈ అవార్డుల కార్యక్రమానికి వచ్చానన్నారు. ఎలికో లిమిటెడ్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ వనితా దాట్ల మహిళలు అన్ని రంగాల్లో రాణించడం ఎంతో అవసరమన్నారు. 

కార్యక్రమంలో టి-హబ్‌ సీఈఓ ఎంశ్రీనివాసరావు, హెచ్‌ఎస్‌బీసీ ఎండీ మమతా మాదిరెడ్డి, పూర్వవిద్యార్థుల సంఘం కో  ఆదితి ఆర్య కోటక్, శిల్పారెడ్డి ప్రసంగించారు. ఇకపోతే అత్తాకోడళ్ల అనుబంధాన్ని మెగా పవర్ స్టార్ రాంచరణ్ భార్య ఉపాసన సరికొత్తగా నిర్వచిస్తున్నారు. అత్తమ్మ వంటకాలను, రుచిని అందరికీ తెలిసేలా మెగా పవర్ స్టార్ రాంచరణ్ భార్య ఉపాసన చేస్తున్నారు. తన అత్తగారైన సురేఖ కొణిదెల వంటలను అందరికీ రుచి చూపించేలా అత్తమ్మ కిచెన్ పేరుతో ఫుడ్ బిజినెస్‌ను ప్రారంభించారు మెగా పవర్ స్టార్ రాంచరణ్ భార్య ఉపాసన  . సురేఖ కొణిదెల పుట్టినరోజు సందర్భంగా వీటిని ప్రారంభించి.. అసలు సిసలైన అత్తా కోడళ్ల బంధాన్ని చాటి చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: