"సుహాస్" నెక్స్ట్ మూవీ నుండి అదిరిపోయా అప్డేట్ వచ్చేసింది..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం వరుస పెట్టి విజయాలను అందుకుంటు ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న యువ నటులలో సుహాస్ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అలాంటి సమయం లోనే ఈయన కలర్ ఫోటో అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ నేరుగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోనే విడుదల అయినప్పటికీ ఇందులో ఈయన తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఈ సినిమా కూడా ప్రేక్షకులను అలరించడంతో ఈ మూవీ ద్వారా ఈయనకు మంచి గుర్తింపు లభించింది.
 

ఆ తర్వాత నుండి ఈ నటుడికి వరుసగా సినిమాల్లో హీరో అవకాశాలు దక్కుతున్నాయి. అందులో భాగంగా పోయిన సంవత్సరం ఈయన రైటర్ పద్మభూషణ్ అనే సినిమాలో హీరో గా నటించి మంచి విజయాన్ని అందుకున్నాడు. అలాగే ఇప్పటికే ఈ సంవత్సరం అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించి మరో విజయాన్ని అందుకున్నాడు.

ఇలా వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న సుహాస్ ప్రస్తుతం "ప్రసన్న వదనం" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ బృందం వారు నిన్ననే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ ను మరియు ఈ సినిమా టైటిల్ ను విడుదల చేశారు. అలాగే ఈ మూవీ యొక్క టీజర్ విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ యొక్క టీజర్ ను మార్చి 7 వ తేదీన ఉదయం 11 గంటల 07 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: