జూనియర్ బావమరిదితో ఆయ్ !

Seetha Sailaja

టాప్ హీరోల కొడుకులు మనవలు తమ్ముళ్ళు హీరోలుగా కొనసాగుతున్న టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోల బావమరుదులు హీరోలు అయిన సందర్భాలు పెద్దగా కనిపించవు. ఇప్పుడు ఆలోటును జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ తీర్చడానికి తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. సినిమాల పట్ల విపరీతమైన ఆశక్తి ఉన్న నార్నె నితిన్ హీరోగా మారడానికి గత కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.

కొంతకాలం క్రితం అతడు హీరోగా పరిచయం అవ్వాలని ప్రయత్నిస్తూ మొదలుపెట్టిన ‘శ్రీశ్రీశ్రీ రాజా వారు’ కొన్ని కారణాలతో మధ్యలోనే ఆగిపోయింది. ఆతరువాత అతడు నటించిన ‘మ్యాడ్’ మూవీలో నటించిన హీరోలలో ఒకరిగా కనిపించినా చాలామంది ఆమూవీలో నటించిన శోభన్ గురించి మాట్లాడుకున్నారు కానీ ఇతడిని గురించి పెద్దగా పట్టించుకోలేదు.

దీనితో తన పట్టుదల వదలకుండా హీరోగా మారాలని అతడు చేస్తున్న ప్రయత్నాలకు ఇప్పుడు ఫలితం వచ్చినట్లుగా కనిపిస్తోంది. అతడిని హీరోగా చేయడానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నేతృత్వంలోని గీతా ఆర్ట్స్ 2 ముందుకు వస్తోంది. లేటెస్ట్ గా ఈమూవీ టైటిల్ ను ‘ఆయ్’ గా ఫిక్స్ చేశారు. అంజి కంచిపల్లి అనే కొత్త దర్శకుడు తీస్తున్న ఈమూవీలో నయన్ సారిక కథానాయికగా నటిస్తోంది. టైటిల్ అనౌన్స్‌మెంట్ కొంచెం భిన్నంగా చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. నిర్మాత బన్నీ వాసు ఈమూవీ దర్శకుడుని విసుక్కుంటూ ఫోన్ చేయి టైటిల్ పెట్టడం ఎందుకు లేట్ అని అడిగినప్పుడు దర్శకుడు ‘ఆయ్’ అనడం అది అర్థం కాక బన్నీ వాస్ మరింత అసహనానికి లోనవ్వడం చాల సహజంగా టైటిల్ ఎనౌన్స్ మెంట్ టైటిల్ లో తీశారు.

‘ఆయ్’ అనే టైటిల్‌కు ‘మేం ఫ్రెండ్సండీ’ అనే ట్యాగ్ లైన్ ఫిక్స్ చేశారు. ఈమూవీ ఫస్ట్ లుక్ ఈనెల 7న లాంచ్ చేయబోతున్నారు. జూనియర్ బావమరిది ఈమూవీలో చేస్తున్న ప్రయత్నం విజయవంతం అయితే తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని తెచ్చుకునే ఆస్కారం ఉండటమే కాకుండా ఇక రానున్న రోజులలో చాలామంది హీరోల బావమరుదులు ఇతడిని స్పూర్తిగా తీసుకుని సినిమాలలోకి హీరోలుగా ఎంట్రీ ఇచ్చే ఆస్కారం ఉంది..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: