జై హనుమాన్ అంతకుమించి ఉంటుందట..!

shami
ప్రశాంత్ వర్మ తెరకెక్కిన హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. తేజా సజ్జా లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషనల్ హిట్ సాధించింది. ఈ సినిమా 300 కోట్ల పైగా వసూళ్లను రాబట్టి సక్సెస్ ఫుల్ గా 150 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన అ! సినిమా నుంచి తనను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. హనుమాన్ సక్సెస్ ఇచ్చిన ప్రోత్సాహం తో ఫ్యూచర్ లో మరిన్ని ప్రయోగాలు చేస్తానని అన్నారు.
హనుమాన్ సీక్వెల్ గా జై హనుమాన్ సినిమా రాబోతుండగా త్వరలోనే ఆ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ వస్తుందని చెప్పారు ప్రశాంత్ వర్మ. అంతేకాదు జై హనుమాన్ లో హనుమాన్ మాత్రమే హీరోగా కనిపిస్తాడని అన్నారు. హనుమాన్ క్లైమాక్స్ కన్నా జై హనుమాన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని అంచనాలు పెంచారు ప్రశాంత్ వర్మ.
జై హనుమాన్ సినిమా లో హనుమాన్ గా ఎవరు నటిస్తారు అన్నది మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. ఒక స్టార్ హీరో హనుమాన్ గా చేస్తారని చెబుతున్నా అతను ఎవరన్నది మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. టాలీవుడ్, బాలీవుడ్ స్టార్స్ అందరి పేర్లు మీడియా లో సర్క్యులేట్ అవుతున్నాయి. అయితే అసలు హనుమాన్ ఎవరన్నది ప్రశాంత్ వర్మ చెబితేనే తెలుస్తుంది. జై హనుమాన్ సినిమా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ ఉంటుందని సినిమా ఆడియన్స్ అంచనాలను మించి ఉంటుందని చెబుతున్నారు ప్రశాంత్ వర్మ. హనుమాన్ సక్సెస్ జోష్ చూసిన తర్వాత జై హనుమాన్ మీద అంచనాలు పెరిగాయి. అయితే జై హనుమాన్ ప్రతి విషయంలో భారీ గా ప్లాన్ చేస్తున్నారు ప్రశాంత్ వర్మ. సినిమా బడ్జెట్ కూడా భారీగానే ఉంటుందని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: