దసరాకి బాలయ్య టార్గెట్ ఫిక్స్..!

shami
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కె.ఎస్ బాబీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఎన్.బి.కె 109 వ సినిమా గా వస్తున్న ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యున్ ఫోర్ సినిమాస్ కలిసి నిర్మిస్తున్నారు. శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. తన మార్క్ మాస్ యాక్షన్ సినిమాలు చేసే బాబీ ఈ సినిమాను కూడా సంథింగ్ స్పెషల్ గా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది.
బాలయ్యకు ఉన్న మాస్ ఇమేజ్ కి తగినట్టుగానే బాబీ ఈ మూవీని రూపొందిస్తున్నారని తెలుస్తుంది. సినిమాలో భారీ యాక్షన్ సీన్స్ ఫ్యాన్స్ కి ఐ ఫీస్ట్ అందిస్తాయని అంటున్నారు. ఇదిలాఉంటే ఈ సినిమా రిలీజ్ డేట్ పై మరో కొత్త డేట్ వినిపిస్తుంది. మొన్నటి దాకా ఈ సినిమా జూలై థర్డ్ లేదా ఫోర్త్ వీక్ లో రిలీజ్ అవుతుందని వార్తలు రాగా లేటెస్ట్ గా అది కాస్త అక్టోబర్ దాకా వెళ్లినట్టు చెప్పుకుంటున్నారు.
అక్టోబర్ 10న దేవర రిలీజ్ కన్ఫర్మ్ చేయగా.. బాలకృష్ణ 109వ సినిమా మాత్రం అక్టోబర్ 3న రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. దేవర 1 కన్నా ఒక వారం ముందు బాలకృష్ణ సినిమాను తెచ్చే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఆల్రెడీ సెప్టెంబర్ 27న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు. ఇక ఇప్పుడు ఆ వారం తర్వాత బాలయ్య సినిమా రిలీజ్ లాక్ చేస్తున్నారు. సెప్టెంబర్ చివరి వారం నుంచి అక్టోబర్ 10 వరకు సినిమాలతో ఆడియన్స్ కు పండుగ తెచ్చేలా ఉన్నారు. అక్టోబర్ 11న నాగ చైతన్య తండేల్ ని కూడా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. సో దసరాకి దాదాపు రెండు వారాల ముందు నుంచే బాక్సాఫీస్ దగ్గర ఇంట్రెస్టింగ్ ఫైట్ షురూ కానుందని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: