"స్పిరిట్" స్టోరీ పై ఫుల్ క్లారిటీ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగ..!

Pulgam Srinivas
ఇండియా వ్యాప్తంగా ఫుల్ క్రేజ్ కలిగిన దర్శకులలో సందీప్ రెడ్డి వంగ ఒకరు. ఈయన విజయ్ దేవరకొండ హీరో గా షాలిని పాండే హీరోయిన్ గా రూపొందిన అర్జున్ రెడ్డి మూవీ తో దర్శకుడి గా తన కెరియర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ సూపర్ సక్సెస్ కావడం తో ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈ దర్శకుడు ఇదే కథను హిందీ లో కబీర్ సింగ్ పేరుతో రూపొందించాడు. ఈ మూవీ హిందీ లో కూడా అద్భుతమైన విజయం సాధించడంతో ఈయనకు బాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా ఫుల్ క్రేజ్ లభించింది.

ఇకపోతే ఈ దర్శకుడు తాజాగా రన్బీర్ కపూర్ హీరో గా రష్మిక మందన హీరోయిన్ గా యానిమల్ అనే సినిమాను రూపొందించాడు. భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ మూవీ తర్వాత సందీప్ రెడ్డి వంగ "యానిమల్"  మూవీ కి కొనసాగింపుగా "యానిమల్ పార్క్" మూవీ ని రూపొందిస్తాడు అని వార్తలు వచ్చాయి. కాకపోతే ఈయన తాజాగా నా తదుపరి మూవీ ప్రభాస్ తో స్పిరిట్ అని కన్ఫామ్ చేశాడు.

ఇకపోతే చాలా రోజులుగా ప్రభాస్ తో నేను తీయబోయే స్పిరిట్ మూవీ హార్రర్ జోనర్ కు సంబంధించింది అని వార్తలు వస్తున్నాయి. అవన్నీ ఏ మాత్రం వాస్తవం కాదు. ప్రభాస్ "స్పిరిట్" మూవీ లో పోలీస్ ఆఫీసర్ గా ఉంటాడు. నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రభాస్ "స్పిరిట్" మూవీ లో కనిపించబోతున్నాడు అని స్పిరిట్ మూవీ కి సంబంధించిన క్రేజీ అప్డేట్ ను తాజాగా సందీప్ రెడ్డి వంగ తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

srv

సంబంధిత వార్తలు: