"ఓటిటి" లోకి ఎంట్రీ ఇచ్చిన "అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్"..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ నటుడు సుహాస్ తాజాగా అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయ్యి ఈ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఇకపోతే ఈ మూవీ లోని సూహస్ నటనకు గాను ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి.  బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఈ సినిమా తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ "ఓ టి టి" సంస్థలలో ఒకటి అయినటువంటి ఆహా సంస్థ దక్కించుకుంది.
 

అందులో భాగంగా ఈ సినిమాను ప్రస్తుతం ఈ సంస్థ వారు తమ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇకపోతే ఎవరైనా ఈ మూవీ ని థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ప్రస్తుతం ఈ మూవీ ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో తెలుగు భాషలో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి. ఇకపోతే ఇప్పటికే థియేటర్ ప్రేక్షకులను భారీ స్థాయిలో అలరించిన ఈ సినిమా "ఓ టి టి" ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుంది అనే విషయం తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇకపోతే పోయిన సంవత్సరం రైటర్ పద్మభూషణ్ అనే మూవీ తో మంచి విజయం అందుకున్న సుహాష్ ఈ సంవత్సరం అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ తో మరో సక్సెస్ నీ అందుకున్నాడు. ఇలా ఈయన వరుస విజయాలను అందుకుంటూ తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును ఏర్పరచుకుంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: