గోపీచంద్ "బీమా" ట్రైలర్ కు అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్... ఏకంగా అన్ని వ్యూస్..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో గోపీచంద్ ఒకరు. ఇకపోతే గోపీచంద్ కొంత కాలం క్రితం సిటిమార్ అనే సినిమాతో మంచి విజయం అందుకున్నాడు. ఆ తర్వాత మారుతీ దర్శకత్వంలో రూపొందిన పక్కా కమర్షియల్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు. ఆ తర్వాత శ్రీ వాసు దర్శకత్వంలో రూపొందిన రామబాణం అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఇలా వరుసగా రెండు భారీ అపజయాలను అందుకున్న గోపీచంద్ తాజాగా బీమా అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో గోపీచంద్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. మాళవిక శర్మ , ప్రియ భవాని శంకర్ ఈ మూవీ లో హీరోయిన్ లుగా నటించగా ... హర్ష ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.
 

ఈ సినిమాను ఈ సంవత్సరం మార్చి 8 వ తేదీన మహా శివరాత్రి సందర్భంగా థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా బృందం ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేసింది. ఇకపోతే ఈ మూవీ ట్రైలర్ అదిరిపోయే రేంజ్ లో ఉండడం ఇందులో గోపీచంద్ లుక్స్ , బాడీ లాంగ్వేజ్ , డైలాగ్ డెలివరీ అద్భుతంగా ఉండడంతో ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించింది. ఇకపోతే ఈ మూవీ ట్రైలర్ ఇప్పటికే యూట్యూబ్ లో కోటి ప్లస్ వ్యూస్ ను సాధించింది. ఈ విషయాన్ని ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

gc

సంబంధిత వార్తలు: