మరొకసారి ఆర్ ఆర్ ఆర్ స్ట్రాటజీని అనుసరిస్తున్న రాజమౌళి !

Seetha Sailaja
మహేష్ రాజమౌళిల కాంబినేషన్ లో రూపొందయపోతున్న మూవీకి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ చకచకా జరిగిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏప్రియల్ లో రాబోతున్న ‘ఉగాది’ పండుగరోజున ఈమూవీకి సంబంధించిన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆసమావేశానికి జాతీయ మీడియా ప్రతినిధులను కూడ ఆహ్వానించి తమ ప్రాజెక్ట్ మొదలు కాకుండానే నేషన్ వైడ్ గా ట్రెండింగ్ గా మార్చాలని ఆలోచనలలో రాజమౌళి ఉన్నట్లు టాక్.

రాజమౌళి గతంలో తీసిన ‘ఆర్ ఆర్ ఆర్’ అనుసరించిన స్ట్రాటజీని మళ్ళీ మహేష్ మూవీ విషయంలో కూడ అనుసరించాలని జక్కన్న ఒక స్థిర నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీకి జాతీయ స్థాయిలో ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేయడానికి బాలీవుడ్ టాప్ హీరో అజయ్ దేవగణ్ అలియా భట్ లతో పాటు ఒక బ్రిటీష్ బ్యూటీని కూడ ఎంపిక చేసిన విధంగా మహేష్ తో తీయబోతున్న మూవీ విషయంలో కూడ అదే స్ట్రాటజీని అనుసరిస్తాడాని టాక్.

బాలీవుడ్ ప్రేక్షకులకు మహేష్ తో పోల్చుకుంటే నాగార్జున సుపరిచితుడు కాబట్టి అతడిని ఈ ప్రాజెక్ట్ లో ఒక కీలక పాత్రలో ఎంపిక చేయడమే కాకుండా బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనె ని కూడ ఈ ప్రాజెక్ట్ లోకి ఎంటర్ చేయడంతో పాటు మహేష్ పక్కన హీరోయిన్ గా ఒక ప్రముఖ హాలీవుడ్ హీరోయిన్ ని ఎంపిక చేయడం కోసం చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

దీనితో రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్ విషయంలో ఎలాంటి స్ట్రాటజీ అనుసరించాడో అదే స్ట్రాటజీని మహేష్ తో తీయబోతున్న మూవీ విషయంలో కూడ అనుసరిస్తున్నాడు అనుకోవాలి. అయితే ఈమూవీని రెండు భాగాలుగా తీయాల లేదంటే ఒక భాగంగా ముగించాల అన్న విషయమై ప్రస్తుతానికి జక్కన్న కన్ఫ్యూజన్ లో తెలుస్తోంది.. ఈ ఫారెస్ట్ అడ్వెంచర్ థ్రిల్లర్ కు మహారాజా అనే టైటిల్ ప్రచారంలోకి  వచ్చినప్పటికీ  ఈ  టైటిల్  విషయం లో  ఇప్పటివరకు  ఎటువంటి   నిర్ణయం  జరగలేదు  అంటున్నారు...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: