ఫుల్ స్వింగ్ లో శ్రీ విష్ణు... ఏకంగా మూడు సినిమాలు..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ హీరో లలో ఒకరు అయినటువంటి శ్రీ విష్ణు ప్రస్తుతం ప్రస్తుతం ఫుల్ జోష్ లో తన కెరీర్ ను ముందుకు సాగిస్తున్నాడు . ఇక పోతే ఈయన ప్రస్తుతం ఓ సినిమాలో నటిస్తూనే మరో రెండు క్రేజీ బ్యానర్ లలో సినిమాలను సెట్ చేసి పెట్టుకున్నాడు . ఈయన ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు ఏమిటి ..? ఆ తర్వాత చేయ బోయే సినిమాలు ఏమిటి అనే వివరాలను తెలుసుకుందాం.
ఈ నటుడు ప్రస్తుతం ఓం భీమ్ బుష్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని మార్చి 22 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ మూవీ లో ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. ఇక ఈ మూవీ విడుదలకు ముందే ఈయన హసిత్ గోలి దర్శకత్వంలో స్వాగ్ అనే సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన రేపు విడుదల కానుంది.

ఇది ఇలా ఉంటే ఈ యువ నటుడు తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన నిర్మాణ సంస్థలలో ఒకటి అయినటువంటి గీత ఆర్ట్స్ బ్యానర్ లో కూడా ఓ మూవీ చేయబోతున్నాడు. ఇప్పటికే శ్రీ విష్ణు ఈ బ్యానర్ లో ఓ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రేపు సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇలా ఒక సినిమా విడుదలకు రెడీగా ఉండగానే శ్రీ విష్ణు మరో రెండు మూవీ లను ఓకే చేసుకొని ఫుల్ జోష్ లో తన కెరీర్ ను ముందుకు సాగిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

sv

సంబంధిత వార్తలు: