"ఆపరేషన్ వాలెంటైన్" ఓవర్సీస్ హక్కులకు సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది..!

Pulgam Srinivas
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరో గా రూపొందిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమా మార్చి 1 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , హిందీ భాషలలో థియేటర్ లలో విడుదల కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ చిత్ర బృందం ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన దాదాపు అన్ని ఏరియాలో థియేటర్ హక్కులను అమ్మి వేసింది. అందులో భాగంగా ఈ మూవీ యొక్క రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులను ఏ సంస్థల వారు దక్కించుకున్నారు అనే విషయాలను ఇప్పటికే ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు.

ఇకపోతే తాజాగా ఈ సినిమా యొక్క ఓవర్ సీస్ హక్కులను మరియు నార్త్ అమెరికా డిస్ట్రిబ్యూషన్ హక్కులను ఏ సంస్థలు దక్కించుకున్నాయి అనే విషయాలను కూడా ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క ఓవర్ సీస్ హక్కులను మరుధార్ సంస్థ దక్కించుకున్నట్లు అలాగే నార్త్ అమెరికా డిస్ట్రిబ్యూషన్ హక్కులను ఫునసియా ఫిలిమ్స్ సంస్థ వారు దక్కించుకున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇకపోతే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ చిత్ర బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేశారు. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి "యు / ఏ" సర్టిఫికెట్ వచ్చింది. ఈ విషయాన్ని కూడా ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ఈ సినిమాను రెండు గంటల నాలుగు నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

vt

సంబంధిత వార్తలు: