ఆముగ్గురికి కీలకంగా మారిన మార్చి !

Seetha Sailaja

సంక్రాంతి తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్‌లో ఎటువంటి హడావిడి కనిపించడంలేదు. ఫిబ్రవరి నెలలలో విడుదలైన సినిమాలు  ప్రేక్షకులను ఏమాత్రం సంతృప్తి పరచకపోవడంతో తెలుగు  రాష్ట్రాలలో  ధియేటర్స్ అన్ని ప్రేక్షకులు లేక వెలవెలబోతున్నాయి. ‘అంబాజీపేట మ్యారేజీబ్యాండు’ ఈగల్’ ‘ఊరు పేరు భైరవకోన’ సినిమాలలో ఏఒక్క  సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలం కావడంతో ఈమూవీ బయ్యర్లు బాగా నష్టపోయారు అన్న సంకేతాలు వస్తున్నాయి.    

దీనితో ఇండస్ట్రి వర్గాలు ఆశలు అన్ని మార్చినెల పై ఉన్నాయి. ఈనేపధ్యంలో రాబోతున్న మార్చినెలలో విడుదలకాబోతున్న మూడు సినిమాలు ముగ్గురు హీరోల కెరియర్ కు కీలకంగా మారనున్నాయి.    వాస్తవానికి ఆ ముగ్గురు హీరోలకు మంచి పేరు ఉన్నప్పటికి గత కొంతకాలంగా ఆ ముగ్గురు వరస ఫ్లాప్ లతో సతమతమైపోతున్నారు.    వారే వరుణ్ తేజ్ గోపీచంద్ అల్లరి నరేష్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ ‘భీమ’ ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమాలతో ఈముగ్గురు హీరోలు వారి  అదృష్టాన్ని పరీక్షించు కుంటున్నారు.    

దీనితో ఈముగ్గురు హీరోలలో ఎవరికి మార్చి కలసి వస్తుంది అన్న ఆశక్తి  ఇండస్ట్రీ వర్గాలలో ఉంది. ‘ఫిదా’ ‘తొలి ప్రేమ’ ‘ఎఫ్ 2’ లాంటి సూపర్ హిట్లతో ఒకప్పుడు దూసుకుపోయిన వరుణ్ తేజ్ గత రెండేళ్లుగా వరస  ఫ్లాప్ లతో సతమతమై పోతున్నాడు. ‘గని’ ‘ఎఫ్-3’ ‘గాండీవధారి అర్జున’ ఇలా వరుసగా అతడికి వరస పరాజయాలు ఎదురుకావడంతో అతడి   మార్కెట్ బాగా తగ్గి పోయింది అంటున్నారు. దీనితో ఈమెగా ప్రిన్స్ కి  ‘ఆపరేషన్ వాలెంటైన్’ హిట్ కావడం అతడికి కీలకంగా మారింది.    

వరుణ్ తేజ కెరియర్ లో మొదటి పాన్ ఇండియా సినిమా ఇది. అయితే  ఈసినిమా పై సగటు ప్రేక్షకులలో హైప్ తక్కుగా ఉంది అన్న వార్తలు  వస్తున్నాయి. ఈమూవీ మార్చి 1న విడుదలకాబోతోంది. ఈమూవీ  విడుదలైన వారం రోజుల గ్యాప్ లో విడుదలకాబోతున్న హీరో గోపీచంద్    ‘భీమా’ పై కూడా పెద్దగా  అంచనాలు లేవు ‘రామబాణం’ ఫైల్యూర్  తరువాత  విడుదకాబోతున్న  మూవీ  కావడంతో  ఈమూవీ పై గోపిచంద్  కెరియర్ ఆధారపడి ఉంటుంది.  ఒకప్పుడు కామెడీ చిత్రాలతో తనకంటూ  ఒక ప్రత్యేకమైన మార్క్ ను  ఏర్పరుచుకున్న అల్లరి నరేష్ ‘నాంది’ తరువాత హిట్ లేదు. అతడు నటించిన మారేడుమిల్లి ప్రజానీకం ఉగ్రం ఫ్లాప్ లుగా మారడంతో అతడు కెరియర్ కూడ సమస్యలలో ఉంది.  మార్చినెలలో ఈ అల్లరోడు  ‘ఆ ఒక్కటి అడక్కు’  అంటూ ప్రేక్షకులు  మరిచిపోయిన  తన కామిడీ  టచ్ ని  గుర్తుకు  చేయ బోతున్నాడు.  దీనితో ఈముగ్గురిలో ఎవరికి మార్చి కలసి వస్తుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: