ఇకపోతే ప్రస్తుతం
నాని ...
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న సరిపోదా శనివారం అనే సినిమాలో
హీరో గా నటిస్తున్నాడు. ఈ
మూవీ ని కూడా తెలుగు ,
తమిళ ,
కన్నడ , మలయాళ ,
హిందీ భాషలలో విడుదల చేయనున్నారు.
ప్రియాంక అరుల్
మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ
మూవీ లో
ఎస్ జె సూర్య విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇకపోతే ఈ
మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
సినిమా నుండి ఈ చిత్ర బృందం వారు గ్లీమ్స్ వీడియోను విడుదల చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ గ్లిమ్స్ వీడియోలో
నాని ,
ఎస్ జె సూర్య నటనలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇకపోతే ఈ గ్లీమ్స్ వీడియోకు 24 గంటల సమయంలో 2.01 మిలియన్ వ్యూస్ ... 79.6 కే లైక్స్ లభించాయి. ఓవరాల్ గా చూసుకుంటే సరిపోదా శనివారం
సినిమా గ్లీమ్స్ వీడియోకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు.