మరో పొరపాటు చేస్తున్న రవితేజా !

Seetha Sailaja
మాస్ మహారాజగా లక్షలాది అభిమానులను పొందిన రవితేజా పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. వరస ఫ్లాప్ లతో సతమతమైపోతున్న ఈహీరోకి ‘ధమాక’ సక్సస్ జోష్ ను కలిగించింది. అయితే ఆతరువాత రవితేజా సోలో హీరోగా నటించిన సినిమాలు అన్నీ వరస ఫ్లాప్ లుగా మారుతూ ఉండటంతో కథల ఎంపిక విషయంలో మాస్ మహారాజ పొరపాటు చేస్తున్నాడా అన్న సందేహాలు అతడి అభిమానులకు కలుగుతున్నాయి.

వరసపెట్టి సినిమాలు చేస్తున్న రవితేజా చిన్న సినిమాలను ప్రమోట్ చేసే ఉద్దేశ్యంలో ఒక సొంత నిర్మాణ సంస్థను స్థాపించి చేస్తున్న ప్రయత్నాలు కూడ కలిసిరాకపోవడం షాకింగ్ గా మారింది. ‘ఛాంగురే బంగారురాజా’ నుంచి రవితేజా చిన్న సినిమాల నిర్మాతగా మారాడు. ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ కార్తీక్ రత్నంతో పాటు అధిక శాతం కమెడియన్లను క్యాస్టింగ్ గా పెట్టుకుని తీసిన ఈ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ కనీస స్థాయిలో మెప్పించలేకపోవడంతో ఫెయిల్ అయింది.

లేటెస్ట్ గా రవితేజా నిర్మాణ సంస్థ నుండి వచ్చిన ‘సుందరం మాస్టర్’ కూడ ఫెయిల్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. కమెడియన్ హర్ష చెముడుని హీరోగా పరిచయం చేస్తూ తీసిన ఈసినిమాకు కానీసపు ఓపెనింగ్ కలక్షన్స్ కూడ రాకపోవడంతో నిర్మాతగా రవితేజాకు మరొక పరాజయం ఎదురైంది. ఈసినిమా చూసే ప్రేక్షకుల సహనానికి పరీక్షగా మారింది అన్న కామెంట్స్ వస్తున్నాయి.

సగటు ప్రేక్షకులలో రవితేజా సొంత బ్యానర్ అంటే ఒక గౌరవం ఉంటుంది. ఇలా వరస పెట్టి ఫెయిల్ అయ్యే చిన్న సినిమాలను తీయడం వల్ల మాస్ మహారాజాకు ఏమి కలిసివస్తుంది అంటూ అతడి అభిమానులు కూడ మధన పడుతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. దీనితో హీరోగా తన కథల ఎంపిక విషయంలో పొరపాట్లు చేస్తున్న రవితేజా నిర్మాతగా కూడ తన చిన్న సినిమాల విషయంలో పొరపాట్లు చేస్తున్నాడా అంటూ కొందరి కామెంట్స్. ఈ పరిస్థితులు ఇలా కొనసాగుతూ ఉంటే రవితేజా హరీష్ శంకర్ ల కాంబినేషన్ లో రాబోతున్న మూవీతో ఇతడి క్రేజ్ మళ్ళీ పెరుగుతుందని అంచనాలు ఉన్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: