ఈ వారం రోజులు అతి తక్కువ ధరకే థియేటర్లలో "హనుమాన్" మూవీ..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్ట్ గా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న వారిలో తేజ సజ్జ ఒకరు. ఈయన చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలలో హీరో గా నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ఈయన కొంత కాలం క్రితమే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందినటువంటి హనుమాన్ అనే సూపర్ హీరో జోనర్ సినిమాలో హీరో గా నటించాడు.
 

ఇకపోతే ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయింది. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ టాక్ ను ప్రపంచ వ్యాప్తంగా తెచ్చుకుంది. దానితో ఈ మూవీ అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టి ఈ సంవత్సరం మొదట్లోనే ఈ మూవీ భారీ బ్లాక్ బస్టర్ సినిమాల లిస్ట్ లో చేరిపోయింది.

ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఒక అద్భుతమైన అప్డేట్ ను ప్రకటించింది. తాజాగా హనుమాన్ మూవీ బృందం ఈ నెల ఫిబ్రవరి 23 వ తేదీ నుండి 29 వ తేదీ వరకు ఇండియాలో ఉన్న అన్ని నేషనల్ మల్టీప్లెక్స్ లలో ఈ సినిమాను కేవలం 112 రూపాయలకే చూసే వెసులు బాటను కల్పిస్తున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఇలా అతి తక్కువ ధరకే హనుమాన్ సినిమాను ప్రేక్షకులకు చూసేందుకు ఈ మూవీ బృందం వీలును కల్పిస్తుంది. మరి దీనితో ఈ సినిమా కలెక్షన్ లు మరింత పెరిగే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: