బాయ్ ఫ్రెండ్ తో యానిమల్ బ్యూటీ..!?

Anilkumar
రణ్ బీర్ కపూర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో తెరకెక్కిన యానిమల్ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు ఊహించని స్థాయిలో ఉండబోతున్నాయని తెలుస్తోంది. టైర్2, టైర్3 ఏరియాలలో యానిమల్ సినిమా సంచలనాలు కొనసాగుతున్నాయి. ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కనుండగా సీక్వెల్ కూడా రికార్డులు క్రియేట్ చేయడం గ్యారంటీ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ సినిమాలో జోయా పాత్రలో మెప్పించిన తృప్తీ డిమ్రీ గురించి చర్చించుకుంటున్నారు.

కథలో ట్విస్ట్ కు కారణమైన ఈ నటి ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్నారు. బోల్డ్ సీన్ లో నటించిన ఈ నటి తన నటనతో ఆకట్టుకున్నారు. రష్మికను సైతం ఈ నటి డామినేట్ చేశారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. తృప్తీ డిమ్రీ ఇప్పటికే పలు ప్రాజెక్ట్ లలో నటించగా ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. ప్రస్తుతం తృప్తీ డ్రిమీ పేరు ట్రెండింగ్ లో ఉంది. ఇదిలా ఉంటే.. త్రిప్తి డిమ్రి పుట్టిన రోజు  కావడం విశేషం. ఈ ముద్దుగుమ్మ నేటితో 30వ ఏటా అడుగుపెట్టింది. ఆమెకు ఫ్యాన్స్, నెటిజన్లు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 గతంలో పెళ్లి గురించి మాట్లాడిన త్రిప్తి డిమ్రీ తనకు 'అమాయకుడు, మంచి వ్యక్తిత్వం అయి ఉండే' వ్యక్తిని పెళ్లిచేసుకుంటానని చెప్పుకొచ్చింది. ఇక త్రిప్తి విజయ్ దేవరకొండకు జోడీగా గౌతమ్ తిన్ననూరు ప్రాజెక్ట్ లో నటించనుందని తెలుస్తోంది. ఈ క్రమంలో త్రిప్తి డిమ్రీకి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఆమె సీక్రెట్ గా బాయ్ ఫ్రెండ్ తో రిలేషన్ మెయిటెయిన్ చేస్తోందని తెలుస్తోంది. అతనితో ఎంతో క్లోజ్ గా ఉన్న ఫొటో ఇప్పుడు వైరల్ గా మారింది..అతను కూడా త్రిప్తికి చాలా దగ్గరి వ్యక్తిలాగా విష్ చేశారు. 'హ్యాపీ బర్త్ డే డియరెస్ట్ త్రిప్తి' అంటూ శుభాకాంక్షలు తెలిపారు. .!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: