ఆర్మాక్స్ మీడియా సంస్థ ఎప్పటి కప్పుడు సినీ తారలకు సంబంధించిన సర్వేలను నిర్వహిస్తూ ఉంటుంది అనే విషయం మనకు తెలిసిందే. అలాగే అందుకు సంబంధించిన సర్వే నివేదికలను కూడా సోషల్ మీడియా వేదికగా ప్రజలకు తెలియజేస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా ఈ సంస్థ వారు ఈ సంవత్సరం జనవరి నెలలో ఇండియా వ్యాప్తంగా అత్యంత క్రేజ్ కలిగిన టాప్ 10 నటీ మణులు ఎవరు అనే విషయం పై సర్వేను నిర్వహించింది. అలాగే తాజాగా అందుకు సంబంధించిన నివేదికలను కూడా విడుదల చేసింది. ఈ సంస్థ తాజాగా నిర్వహించిన సర్వే ప్రకారం ఈ సంవత్సరం జనవరి నెలలో ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ కలిగిన టాప్ 10 నటీమణులు ఎవరు అనే విషయాన్ని తెలుసుకుందాం.
ఈ సంస్థ తాజాగా నిర్వహించిన సర్వే ప్రకారం ఈ సంవత్సరం జనవరి నెలలో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ప్రధమ స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి సమంత రెండవ స్థానంలో నిలవగా , బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొ ఈ సర్వే లో మూడవ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత హిందీ సినీ పరిశ్రమలో మంచి క్రేజీ కలిగిన కత్రినా కైఫ్ 4 వ స్థానంలో నిలవగా , కాజల్ అగర్వాల్ 5 వ స్థానం లోనూ , లేడీ సూపర్ స్టార్ నయన తార 6 వ స్థానం లోనూ , నేషనల్ క్రష్ రష్మిక మందన 7 వ స్థానంలో నిలిచింది. ఇక మోస్ట్ టాలెంటెడ్ బ్యూటీ త్రిష ఈ సర్వే లో 8 వ స్థానంలో నిలవగా. శ్రీ లీల ఈ సర్వే ప్రకారం 9 వ స్థానం లోనూ ... కియార అద్వానీ ఈ సర్వే లో 10 వ స్థానంలో నిలిచింది.