ఈనెల 26 నుండి విశ్వంభరా కొత్త షెడ్యూల్.. ఇందులో జాయిన్ కానున్న ఇద్దరు క్రేజీ బ్యూటీలు..?

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి కొంత కాలం క్రితమే భోళా శంకర్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఇకపోతే ఈ మూవీ తర్వాత చిరంజీవి , మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ కూడా ప్రారంభం అయింది. ఈ మూవీ చిరంజీవి కెరీర్ లో 156 వ మూవీ గా రూపొందుతుంది.

ఇకపోతే కొంత కాలం క్రితమే ఈ చిత్ర బృందం ఈ సినిమాకు విశ్వంభర అనే టైటిల్ ను కన్ఫామ్ చేసింది. ఇక ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని త్రిష హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఈ మూవీ ని యు వి క్రియేషన్స్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ మూవీ కి ఏం ఏం కీరవాణి సంగీతం అందిస్తూ ఉండగా ... యువ హీరోయిన్ లు అయినటువంటి ఇషా చావ్లా , సురభి కూడా ఈ మూవీ లో ముఖ్యమైన పాత్రలలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రెండు షెడ్యూల్ ల షూటింగ్ పూర్తి అయ్యింది.

అందులో మొదటి షెడ్యూల్ ను చిరంజీవి , త్రిష లేకుండా ఈ చిత్ర బృందం చిత్రీకరించింది. రెండవ షెడ్యూల్ లో చిరంజీవి , త్రిష పై ఈ చిత్ర బృందం కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించింది. ఇకపోతే ఈ నెల 26 వ తేదీ నుండి ఈ మూవీ కి సంబంధించిన మూడవ షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది. ఇందులో చిరంజీవి , త్రిష తో పాటు యువ హీరోయిన్ లు అయినటువంటి ఇషా చావ్లా , సురభి కూడా జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో ఈ మూవీ కి సంబంధించిన చాలా కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: