వరుణ్ తేజ్ ముందున్న సవాళ్ళు !

Seetha Sailaja
మెగా అభిమానులతో మెగా ప్రిన్స్ అభిమానంగా పిలిపించుకునే వరుణ్ తేజ్ కు హిట్ వచ్చి చాల సంవత్సరాలు అయింది. ‘ఫిదా’ మూవీ తరువాత ఈమెగా యంగ్ హీరోకు చెప్పుకోతగ్గ స్థాయిలో హిట్ లేదు. ఈపరిస్థితుల నేపధ్యంలో వచ్చేవారం విడుదలకాబోతున్న ‘ఆపరేషన్ వాలెంటైన్’ మూవీ కోసం వరుణ్ తేజ్ చాల కష్టపడి ప్రమోట్ చేస్తున్నా అతడి లేటెస్ట్ మూవీ ‘ఆపరేషన్ వాలెంటైన్’ కు పెద్దగా క్రేజ్ ఏర్పడటంలేదు.

ఈమూవీని పాన్ ఇండియా మూవీగా ప్రమోట్ చేస్తూ బాలీవుడ్ లో కూడ వరుణ్ తేజ్ పై క్రేజ్ పెంచడానికి ఈ మెగా యంగ్ హీరో చాలకష్టపడుతున్నాడు. వరుణ్ తేజ్ గతసంవత్సరం నటించిన ‘గాండీవదారి అర్జున’ మెగా ప్రిన్స్ ఆశలకు గండి కొట్టిన విషయం తెలిసిందే. ఈమూవీతో పాటు వరుణ్ తేజ్ తన బాలీవుడ్ ఎంట్రీ గురించి కూడ చాల సీరియస్ గా ఆలోచిస్తూ ఈమూవీని బాలీవుడ్ లో కూడ చాల విపరీతంగా ప్రమోట్ చేస్తున్నాడు.

అయితే బాలీవుడ్ లో కూడ ఈమూవీకి సరైన ఓపెనింగ్స్ రాకపోతే తన కెరియర్ ఇరుకున పడుతుందని మెగా ప్రిన్స్ ఈసినిమాను బాలీవుడ్ లో కూడ విపరీతంగా ప్రమోట్ చేస్తున్నాడు. అయితే అక్కడ కూడ ఈమూవీకి సరైన క్రేజ్ రావడం లేదు అని అంటున్నారు. పాన్ ఇండియా మూవీగా ఈమూవీ బాలీవుడ్ తో పాటు తెలుగు రాష్ట్రాలలో కూడా ఒకేసారి విడుదల కాబోతోంది.
ఈసినిమా చూసిన వారికి గతంలో హృతిక్ రోషన్ నటించిన ‘ఫైటర్’ మూవీ ఛాయలు గుర్తుకు వస్తాయి అని అంటున్నారు. ఇప్పటికే ‘ఆపరేషన్ వాలెంటైన్’ మూవీ ట్రైలర్ కు వచ్చిన స్పందన విపరీతంగా ఉండటంతో ఈమూవీ మెగా ప్రిన్స్ కు కోరుకున్న హిట్ ఇచ్చే ఆస్కారం ఉంది అంటున్నారు. అయితే అంత సులభంగా వరుణ్ తేజ్ కు హిట్ దక్కకపోవచ్చని ఈమూవీతో పోటీగా విడుదల అవుతున్న హాలీవుడ్ మూవీ ‘డ్యూన్ 2’ పై భారీ అంచనాలు ఉండటంతో పాటు వెన్నెల కిషోర్ నటించిన ‘చారి 111’ కు గట్టి పోటీ ఇచ్చే ఆస్కారం ఉంది అంటున్నారు..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: