కోనవెంకట్ ఆలోచనలకు షాక్ లో ఇండస్ట్రి వర్గాలు !

Seetha Sailaja
సినిమాలకు ప్రేక్షకులు రావడం బాగా తగ్గిపోవడంతో తమ సినిమాకు ఏదోవిధంగా ప్రేక్షకులను రప్పించాలి అన్న వ్యూహంతో రకరకాల పబ్లిసిటీ మార్గాలు మూవీ మేకర్స్ ఎంచుకుంటున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్టోరీ రైటర్ గా ఒక వెలుగు వెలిగిన కోన వెంకట్ హవా ప్రస్తుతం తక్కువగా కనిపిస్తోంది.

దీనితో టాప్ హీరోల సినిమాలకు కథలు అందించే అవకాశాలు బాగా తగ్గిపోయాయి. దీనితో గతంలో తనకు లక్ ఇచ్చిన ‘గీతాంజలి’ మూవీకి సీక్వెల్ గా తీసిన ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ మూవీ పై చాల ఆశలు పెట్టుకున్నాడు. ఒక యంగ్ డైరెక్టర్ కు ఈ మూవీ దర్శకత్వం బాధ్యతలను అప్పచెప్పిన కోన వెంకట ఈ మూవీకి అన్నీ తానై వ్యవహరిస్తున్నాడు.

అంజలి శ్రీనివాస్ రెడ్డి ల కాంబినేషన్ లో రూపొందిన ఈ మూవీ ట్రైలర్ లాంచ్ చాల డిఫరెంట్ గా చేస్తున్నారు. ఇప్పటివరకు ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీలో ఎవరు చేయని విధంగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ బేగంపేట్ శ్మశానబాటిక లో జరపబోతు ఉండటం మరింత షాకింగ్ గా మారింది. ఈ ఈవెంట్ కోసం స్మశానవాటిక ను రంగుల దీపాలతో అలంకరించడమే కాకుండా ఈ ఈవెంట్ కు మీడియా వర్గాలను అదేవిధంగా ఇండస్ట్రీ  ప్రముఖులను ఆహ్వానించడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.

హారర్ ఎలిమెంట్ తో నిర్మించిన చాల సినిమాలు గతంలో విజయవంతమైన పరిస్థితులలో ఆ సెంటిమెంట్ ను నమ్ముకుని కోన వెంకట్ గీతాంజలిని మళ్ళీ రప్పిస్తున్నాడు. అంజలి కెరియర్ లో 50వ సినిమాగా విడుదల అవుతున్న ఈసినిమా ప్రమోషన్ చూస్తున్నవారికి మహాకవి శ్రీశ్రీ చెప్పినట్లు అగ్గిపుల్ల కుక్కపిల్ల సబ్బుబిళ్ళ కవితలకు అనార్హం కాదు అన్న మాటలు గుర్తుకు వస్తాయి. ప్రస్తుతం కోన వెంకట్ అంజలి శ్రీనివాస రెడ్డిల కెరియర్ అంతంత మాత్రంగా ఉండటంతో ఈ గీతాంజలి మళ్ళీ వచ్చి వీరికి ఎలాంటి అదృష్టాన్ని ఇస్తుందో చూడాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: