3 రోజుల్లో "ఊరు పేరు భైరవకోన" కు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటుడు సందీప్ కిషన్ తాజాగా ఊరు పేరు భైరవకోన అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి తెలుగు సినీ పరిశ్రమలో మంచి టాలెంట్ కలిగిన దర్శకులను ఒకరు అయినటువంటి వి ఐ ఆనంద్ దర్శకత్వం వహించగా .. వర్షా బొల్లమ్మ , కావ్య దాపర్ ఈ సినిమాలో హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీ ఫిబ్రవరి 16 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల అయింది. అందులో భాగంగా ఇప్పటికే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 4 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 4 రోజుల్లో ఈ సినిమాకు ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా ఎన్ని కోట్ల కలెక్షన్ లు దక్కాయి అనే వివరాలను తెలుసుకుందాం.

ఈ మూవీ కి 4 రోజుల్లో నైజాం ఏరియాలో 2.65 కోట్ల కలెక్షన్ లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 60 లక్షల కలెక్షన్ లు , ఆంధ్ర ప్రదేశ్ లో 2.70 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా 4 రోజుల్లో ఈ సినిమాకు తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ లో కలిపి 5.95 కోట్ల షేర్ ... 11.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే 4 రోజుల్లో ఈ సినిమాకు కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్ సీస్ లో కలుపుకొని 1.80 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 4 రోజుల్లో 7.75 కోట్ల షేర్ ... 15.05 కోట్ల గ్రాఫ్ కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే ఈ సినిమాకి 11 కోట్ల మేర ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దానితో ఈ సినిమా మరో 3.25 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్ లను వరల్డ్ వైడ్ గా వసూలు చేసినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sk

సంబంధిత వార్తలు: