సుకుమార్ పెట్టిన టార్చర్ ను బయటపెట్టిన గణేష్ ఆచార్య !

Seetha Sailaja
టాలీవుడ్ ఇండస్ట్రీలో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ లిస్టులో రాజమౌళి తరువాత ప్రధమ స్థానంలో ఉండేది ఒక్క సుకుమార్ మాత్రమే. తాను తీసే సినిమా అవుట్ పుట కోసం తాను కష్టపడటమే కాకుండా తన యూనిట్ లో పనిచేసే వారందరితో విపరీతంగా సుకుమార్ కష్టపెడుతూ ఉంటాడు. అందువల్లనే అతడిని పని రాక్షసుడు అంటూ అతడి యూనిట్ సభ్యులు సుకుమార్ ను ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు.

‘పుష్ప’ మూవీతో సుకుమార్ పాన్ ఇండియా స్థాయి  డైరెక్టర్ అయిపోవడంతో ఆ ఇమేజ్ ని మరింత పెంచుకోవడానికి సుకుమార్ ‘పుష్ప 2’ విషయంలో విపరీతంగా కష్టపడుతున్నాడు. ఈసినిమాలో హీరోగా నటిస్తున్న అల్లు అర్జున్ ఈమూవీ కోసం తాను పెంచుకున్న గెడ్డం మీసం గత మూడు సంవత్సరాలుగా భరిస్తున్నాడు అంటే బన్నీని ‘పుష్ప 2’ కోసం ఏవిధంగా కష్టపెడుతున్నాడో అర్థం అవుతుంది.

ఈమధ్య ఈసినిమాకు సంబంధించి అత్యంత కీలకమిన గంగ జాతర ఎపిసోడ్ కు సంబంధించి ఒక కీలకమైన పాటను రామోజీ దిలిం సిటీలో ఒక భారీ సెట్ వేసి కొన్ని వందల మంది డాన్సర్ల మధ్య ఒక పాటను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఆపాటకు గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ చేశాడట. ఈపాట చిత్రీకర కొన్ని వారాలు జరిగినట్లు గణేష్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో  చెప్పాడు,

ఈపాటకు సంబంధించి సుకుమార్ సూచనాలతో స్టెప్స్ మార్చి మార్చి కంపోజ్ చేయడంతో ఆ పాట షూట్ బాగా ఆలస్యం అయిందని చివరకు ఈ పాట షూటింగ్ పూర్తి అయ్యేసరకి తన వళ్ళు హూనం అయింది అంటూ గణేష్ ఆచార్య విషయాలతో ‘పుష్ప 2’ విషయమై సుకుమార్ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడో అర్థం అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈమూవీ అనుకున్న విధంగా ఈ సంవత్సరం ఆగష్టు 15న విడుదల అవ్వడం కష్టం అని వస్తున్న గాసిప్పుల పై సుకుమార్ స్పందిస్తూ ‘పుష్ప 2’ ఆగష్టులో విడుదల అవ్వడం ఖాయం అని అనిఅంటున్నాడు..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: