ఆ తేదీన వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రచారం కానున్న "డెవిల్" మూవీ..!

Pulgam Srinivas
నందమూరి కళ్యాణ్ రామ్ తాజాగా డెవిల్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటించగా ... అభిషేక్ నామ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈయనే స్వయంగా ఈ సినిమాను నిర్మించాడు. మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ టాక్ వచ్చింది. కాకపోతే ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సరిగ్గా పర్ఫార్మ్ చేయలేదు.

దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ మొత్తంలో నష్టాలను చూడవలసి వచ్చింది. అలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. థియేటర్ ప్రేక్షకులను సరిగ్గా ఆకట్టు కోలేక పోయిన ఈ సినిమా "ఓ టి టి" ప్రేక్షకులను మాత్రం బాగానే ఆకట్టుకుంది. ఇకపోతే ఈ సినిమా మరికొన్ని రోజుల్లోనే బుల్లి తెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయింది. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువబడింది.

ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ సంస్థలలో ఒకటి అయినటువంటి ఈ టీవీ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సినిమాని మార్చి 10 వ తేదీన ఆదివారం రోజు సాయంత్రం 6 గంటలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రచారం చేయనున్నట్లు ఈటీవీ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది. మరి థియేటర్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయిన ఆ తర్వాత "ఓ టి టి" ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మరి ఈ సినిమా బుల్లి తెర ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: