"ఓజి" నైజాం ఏరియా హక్కులను దక్కించుకున్న ప్రముఖ డిస్ట్రిబ్యూటర్..?

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు ... ఉస్తాద్ భగత్ సింగ్ ... ఓ జి అనే మూడు మూవీ లలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే పవన్ ప్రస్తుతం నటిస్తున్న ఈ మూడు సినిమా లలో సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ జి మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అందుకు ప్రధాన కారణం ... చాలా కాలం తర్వాత పవన్ రీమిక్ మూవీ లో కాకుండా స్టేట్ మూవీ లో నటిస్తూ ఉండడం ... అలాగే ఇందులో పవన్ లుక్స్ , డ్రెస్సింగ్ స్టైల్ అదిరిపోయే రేంజ్ లో ఉండడం ... ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఈ మూవీ పై పవన్ అభిమానులతో పాటు మామూలు తెలుగు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాను ఈ సంవత్సరం సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి ప్రియాంక అరుల్ మోహన్ , పవన్ సరసన హీరోయిన్ గా కనిపించబోతుంది. ఇకపోతే ఈ సినిమా విడుదలకు చాలా రోజుల ఉన్నప్పటికీ ఇప్పటికే ఈ మూవీ యొక్క థియేటర్ హక్కులకు డిస్ట్రిబ్యూటర్ ల నుండి భారీ రెస్పాన్స్ లభిస్తున్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా ఈ మూవీ యొక్క నైజాం ఏరియా థియేటర్ హక్కులను ఇప్పటికే ఈ చిత్ర బృందం అమ్మి వేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం యొక్క నైజాం ఏరియా థియేటర్ హక్కులను తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతగా , డిస్ట్రిబ్యూటర్ గా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న దిల్ రాజు దక్కించుకున్నట్లు ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: