"దేవర" మూవీకి సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ వివరాలు ఇవే..!

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ "ఆర్ ఆర్ ఆర్" లాంటి అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ తర్వాత దేవర అనే అదిరిపోయే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి కొరటాల శివ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడి గా కనిపించబోతుంది.  సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్న ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే చాలా రోజుల క్రితం ఈ మూవీ దర్శకుడు అయినటువంటి కొరటాల శివ ఈ సినిమా కథ చాలా పెద్దది.

దీనిని ఒక భాగంలో చూపించలేము. అందుకే ఈ సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాము. అందులో భాగంగా ఈ సినిమా యొక్క మొదటి భాగాన్ని 2024 వ సంవత్సరం ఏప్రిల్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. కాకపోతే ఈ సినిమాకు సంబంధించిన చాలా పనులు పెండింగ్ ఉండడంతో ఈ మూవీ ని ఈ చిత్ర బృందం వారు ఏప్రిల్ 5 వ తేదీన కాకుండా అక్టోబర్ 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన కొన్ని క్రేజీ విషయాలు బయటకు వచ్చాయి. 
అవి ఏంటో తెలుసుకుందాం.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన యక్షన్ పార్ట్ షూటింగ్ మొత్తం పూర్తి అయ్యింది. ఇంకొంచెం టాకీ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఓ సాంగ్ కూడా షూట్ చేశారు. మరో నాలుగు పాటల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉంది. మిగిలిన షూటింగ్ ను కూడా చాలా త్వరగా పూర్తి చేసి ఈ మూవీ ని అక్టోబర్ 10 వ తేదీ వరకు కచ్చితంగా విడుదల చేసే ఆలోచనలు ఈ చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: