టిల్లు స్క్వేర్ ను వదులుకుని శ్రీలీల తప్పు చేసిందా !

Seetha Sailaja
ధమాకా’ సూపర్ సక్సస్ తరువాత శ్రీలీల మ్యానియా ఇండస్ట్రీలో అదేవిధంగా యూత్ లో బాగా పెరిగి పోవడంతో ఆమెకు అనేక అవకాశాలు వచ్చాయి. అయితే ఆమె చేసిన సినిమాలు అన్నీ ఫెయిల్ అవ్వడంతో ఇండస్ట్రీలో ఆమె మ్యానియా బాగా తగ్గిపోయింది. ప్రస్తుతం శ్రీలీల చేతిలో ఒక్క సినిమా కూడ లేదు అన్న వార్తలు వస్తున్నాయి.

ఇలాంటి పరిస్థితులలో క్రీజీ యంగ్ హీరో సిద్దూ జొన్నలగడ్డ తో ఆమె నటించవలసి ఉన్న ‘టిల్లు స్క్వేర్’ ను వదులుకుని తప్పు చేసిందా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి ‘టిల్లు స్క్వేర్’ ప్రారంభంలో సిద్దూ పక్కన శ్రీలీల ఎంపిక అయింది. నాలుగు రోజుల పాటు ఆమూవీ షూటింగ్ కి హాజర్ కావడమే కాకుండా కొన్ని రొమాంటిక్ సీన్స్ లో సిద్దూ పక్కన నటించింది అన్న వార్తలు వచ్చాయి.

అయితే ఆసినిమాలో డీప్ లిప్ లాక్ సీన్స్ ఎక్కువగా ఉండటంతో ఆ సీన్స్ లో నటించడానికి శ్రీలీల ఆశక్తి కనపరచక పోవడంతో ఆమె ప్లేస్ లో అనుపమ పరమేశ్వరన్ వచ్చి చేరింది అన్న వార్తలు వచ్చాయి. శ్రీలీల తో ఎదురైన అనుభవాల రీత్యా ఈమూవీ దర్శకుడు అనుమతో ఈమూవీలోని సీన్స్ అన్నింటి గురించి ముఖ్యంగా లిప్ లాక్ సీన్స్ గురించి వివరించి ఆమె అన్నింటినీ అంగీకరించిన తరువాత మాత్రమే ఆమెను ఈ ప్రాజెక్ట్ లోకి ఫైనల్ చేశారు అని అంటారు.

లేటెస్ట్ గా విడుదలైన ‘టిల్లు స్కేర్’ ట్రైలర్ కు వచ్చిన స్పందన ఆకాశానికి తకడంతో ఈమూవీతో అనుపమ క్రేజీ హీరోయిన్ గా మారే ఆస్కారం ఉంది అని అంటున్నారు. దీనితో ఇలాంటి క్రేజీ మూవీని వదులుకుని శ్రీలీల పొరపాటు చేసిందా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి ఆమె నటించిన ‘గుంటూరు కారం’ పై శ్రీలీలకు భారీ ఆశలు ఉండటంతో ‘టిల్లు స్క్వేర్’ ను ఆమె వదులుకుని ఉండవచ్చు అన్న అభిప్రాయాలు కూడ కొందరు వ్యక్తం చేస్తున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: