"ఎస్ కే 21" టైటిల్ టీజర్ ఈరోజు ఆ సమయానికి..!

Pulgam Srinivas
కోలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో శివ కార్తికేయన్ ఒకరు. ఇకపోతే తాజాగా ఈయన అయాలన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఈ సంవత్సరం జనవరి 12 వ తేదీన విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఇకపోతే తాజాగా శివ కార్తికేయన్ కెరియర్ లో 21 వ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం శివ కార్తికేయన్ తన కెరీర్ లో 21 వ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి రాజ్ కుమార్ పెరాయి స్వామి దర్శకత్వం వహిస్తూ ఉండగా ... జీ వి ప్రకాష్ కుమార్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు.

ఇకపోతే ఈ మూవీ కి ఈ చిత్ర బృందం ఇప్పటి వరకు టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ మూవీ శివ కార్తికేయన్ కెరియర్ లో 21 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యం లో ఈ మూవీ బృందం ఈ సినిమా యొక్క షూటింగ్ ను "ఎస్ కే 21" అనే వర్కింగ్ టైటిల్ తో పూర్తి చేస్తూ వస్తుంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ రోజు అనగా ఫిబ్రవరి 16 వ తేదీన సాయంత్రం 6 గంటలకు ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ టీజర్ ను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఇక ఈ పోస్టర్ అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇది ఇలా ఉంటే శివ కార్తికేయన్ "ఆయాలన్" కంటే ముందు మా వీరన్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ తెలుగులో మహా వీరుడు అనే పేరుతో విడుదల అయింది. ఈ సినిమా అటు కోలీవుడ్ ... ఇటు టాలీవుడ్ ఇండస్ట్రి లో కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే మరికొన్ని రోజుల్లోనే ఈ నటుడు మురగదాస్ దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో కూడా హీరో గా నటించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

sk

సంబంధిత వార్తలు: