ట్రెండింగ్ లో రామ్ చరణ్ RC 16 హ్యాష్ ట్యాగ్..!

Anilkumar
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ మూవీతో బిజీగా ఉన్నాడు. తండ్రి కొడుకులుగా నటిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్‌కు హీరోయిన్లుగా బాలీవుడ్ బ్యూటి కియారా అద్వాణీ, అంజలి నటిస్తున్న సంగతి తెలిసిందే. వినయ విధేయ రామ సినిమా తర్వాత గ్లామర్ బ్యూటి కియారా అద్వానీ రామ్ చరణ్ మరోసారి నటిస్తున్న సినిమా ఇది. అయితే ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా రామ్ చరణ్ మరో క్రేజీ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ మాత్రమే కాకుండా చేస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ఆర్‌సీ16.

రామ్ చరణ్ సినీ కెరీర్‌లో 16వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాకు ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికీ ఇంకా టైటిల్ పెట్టని ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో సినిమా అనగానే మంచి బజ్ క్రియేట్ చేసుకుంది. అంతేకాకుండా ఇందులో ఒకప్పటి స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ కూతురు రాషా తడానీ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనుందని రూమర్స్ కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి సోషల్ మీడియాలో ‘RC 16’ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చింది. దీనికి కారణం ఈరోజు దర్శకుడి పుట్టినరోజు కావడమే.

బుచ్చిబాబుకు బర్త్ డేకి విషెస్ తెలియజేస్తూ చిత్ర బృందం సోషియల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. #RC16 కోసం దర్శకుడు సృష్టించే రా అండ్ రస్టిక్ వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను కనువిందు చేస్తుందని పేర్కొన్నారు. రామ్ చరణ్ కోసం బుచ్చిబాబు ఓ రూరల్ స్పోర్ట్స్ డ్రామా కథని రాసుకున్నట్లు తెలుస్తోంది. ఈ స్క్రిప్టు మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా వున్న దర్శకుడు పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఈ ప్రాజెక్ట్ ను కంప్లీట్ చేయడానికి సిద్ధం అవుతున్నారు.’RC 16′ చిత్రాన్ని మార్చిలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించనున్నారని తెలుస్తుంది.. మే నెలలో రెగ్యులర్ షూట్ కి వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: