"ఓజి" పై గంపడాశలు పెట్టుకున్నా పవన్ అభిమానులు... కారణం ఏమిటో తెలుసా..?

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు ... ఉస్తాద్ భగత్ సింగ్ ... ఓజి అనే మూడు మూవీ లలో హీరో గా నటిస్తున్నాడు. కాకపోతే పవన్ అభిమానులు మరియు మామూలు తెలుగు సినీ ప్రేమికులు అంతా కూడా "ఓజి" మూవీ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అందుకు ప్రధాన కారణం ... పవన్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న హరిహర వీరమల్లు మూవీ పై మొదట ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

కానీ ఈ సినిమా షూటింగ్ ఆస్తమాను వాయిదా పడుతూ రావడం. అలాగే ఈ మూవీ కి సంబంధించిన ఏ అప్డేట్ కూడా సరిగా లేకపోవడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు అంత ఆసక్తిని చూపించడం లేదు. అలాగే క్రిష్ కూడా ఈ సినిమా షూటింగ్ మధ్య లోనే కొండపొలం సినిమాకు దర్శకత్వం వహించడం ... మళ్ళీ అనుష్క తో సినిమా చేయనున్నట్లు వార్తలు రావడంతో ఈ మూవీ పై అభిమానుల్లో ఆసక్తి చాలా వరకు తగ్గింది. అలాగే పవన్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ తెరి అనే తమిళ మూవీ కి రీమిక్ అని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ఇప్పటికే తెలుగు.లో పోలీసోడు పేరుతో విడుదల అయ్యింది.

అలా ఇప్పటికే తెలుగు లో విడుదల అయినా సినిమాని మరోసారి రూపొందిస్తూ ఉండడంతో ఈ మూవీ పై పవన్ అభిమానుల్లో కాస్త అంచనాలు ఉన్నప్పటికీ మామూలు ప్రేక్షకుల్లో మాత్రం భారీ ఈ మూవీ పై పెద్దగా అంచనాలు లేవు. ఇకపోతే పవన్ ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో "ఓజి" అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ఫ్రెష్ కథ కావడం అలాగే ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదల ఆయన అన్ని ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై పవన్ అభిమానులు మాత్రమే కాకుండా మామూలు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: