ఆ డైరెక్టర్ ను లైన్ లో పెట్టిన సల్మాన్ ఖాన్..!

Pulgam Srinivas
హిందీ సినీ పరిశ్రమలో టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సల్మాన్ ఇప్పటి వరకు ఎన్నో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ సినిమాలలో హీరో గా నటించి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఆఖరుగా సల్మాన్ యశ్ రాజ్ "స్పై" యూనివర్సిటీ లో భాగంగా రూపొందిన "టైగర్ 3" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ.లో కత్రినా కైఫ్ , సల్మాన్ కి జోడిగా నటించింది.

భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇకపోతే టైగర్ 3 మూవీ తో ప్రేక్షకులను భారీ స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన సల్మాన్ ప్రస్తుతం తన తదుపరి మూవీ పై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా అనేక దర్శకులు చెప్పిన కథలను వింటున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తాజాగా ఓ తమిళ దర్శకుడి కథకు సల్మాన్ ఇంప్రెస్ అయినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... తమిళ సినీ పరిశ్రమలో టాప్ దర్శకులలో ఒకరు అయినటువంటి ఏ ఆర్ మురుగదాస్ తాజాగా సల్మాన్ ఖాన్ కి ఓ కథను వినిపించగా ... ఆ కథ సల్మాన్ కి అద్భుతంగా నచ్చడంతో వెంటనే ఈ దర్శకుడి దర్శకత్వంలో నటించడానికి సల్మాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. ఇకపోతే గతంలో మురగదాస్ హిందీ సినీ పరిశ్రమలో టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి ఆమీర్ ఖాన్ హీరోగా గజినీ అనే మూవీ ని రూపొందించాడు. ఆ సినిమా ఆ సమయంలో అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: