అల్లు అర్జున్ సినిమా కోసం త్రివిక్రమ్ తన స్టైల్ ను మార్చబోతున్నాడా..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన దర్శకులలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో అనేక సినిమాలకు కథ రచయితగా పని చేసే టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ కథ రచయిత స్థానానికి ఎదిగిపోయాడు. ఇక ఆ తర్వాత ఈయన సినిమాలకు దర్శకత్వం చేయడం మొదలు పెట్టాడు. అందులో భాగంగా ఇప్పటికే అనేక సినిమాలకు దర్శకత్వం వహించి అందులో చాలా మూవీ లతో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాలను అందుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ దర్శకులలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే త్రివిక్రమ్ ఇప్పటి వరకు చాలా సినిమాలకు దర్శకత్వం వహించగా అందులో ఎక్కువ శాతం ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలే కావడం విశేషం.

మరి ముఖ్యంగా ఈయన తన సినిమాలలో విడిపోయిన కుటుంబాన్ని చక్కదిద్దే హీరో కాన్సెప్ట్ తో సినిమాలను తీస్తూ ఉంటాడు. దానితో మొదట్లో ఈయన సినిమాల కథను చాలా మంది ఇష్టపడ్డప్పటికీ ఒకే రకం కథలతో త్రివిక్రమ్ సినిమాలను రూపొందిస్తూ ఉండడంతో ఒక వర్గం జనాలకు త్రివిక్రమ్ సినిమాలు అంతగా నచ్చడం లేదు. ఇకపోతే తాజాగా త్రివిక్రమ్ "గుంటూరు కారం" అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో కూడా తల్లికి దూరంగా ఉండే కొడుకు వారిద్దరు ఎలా కలిశారు అనే కాన్సెప్ట్ తో త్రివిక్రమ్ ఈ సినిమాను రూపొందించాడు. ఇలా ఈ సినిమా కథ త్రివిక్రమ్ ఓల్డ్ సినిమాల కథల మాదిరిగానే ఉండడంతో ఈ సినిమాకు మొదట నెగిటివ్ టాక్ వచ్చింది.

అయినప్పటికీ మహేష్ క్రేజ్ తో ఈ మూవీ యావరేజ్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే మరికొన్ని రోజుల్లోనే త్రివిక్రమ్ ... అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం త్రివిక్రమ్ పూర్తిగా తన స్టైల్ ను పక్కన పెట్టి ఒక వేరే రకం కథను తయారు చేస్తున్నట్లు మరికొన్ని రోజుల్లోనే దానిని అల్లు అర్జున్ కు వినిపించబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సారి త్రివిక్రమ్ ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: